https://oktelugu.com/

Daku Maharaj : ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని వదులుకొని కెరీర్ ని రిస్క్ లో పడేసుకున్న స్టార్ హీరో..దురదృష్టం అంటే ఇదే!

ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 16, 2025 / 04:45 PM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద జైత్ర యాత్ర కొనసాగిస్తున్న బాలయ్య, ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ని కొట్టి సూపర్ ఫామ్ తో ముందుకు దూసుకుపోతున్నాడు. మొదటి వారం పూర్తి కాకముందే బ్రేక్ ఈవెన్ కాబోతున్న ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బాబీ రవితేజ నటించిన ‘పవర్’ సినిమాతో ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు రవితేజ అంటే ఒక గాడ్ ఫాదర్ లెక్క ట్రీట్ చేస్తాడు. ఆయన కోసం ఎప్పుడు ది బెస్ట్ స్క్రిప్ట్ ఇవ్వాలనే అనుకుంటాడు. పవర్ తర్వాత ఆయన రవితేజతో చేసిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.

    ఇందులో రవితేజ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి ప్రేక్షకులకు, అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు. అయితే డైరెక్టర్ బాబీ మళ్ళీ ఎప్పుడు రవితేజ తో పూర్తి స్థాయి సినిమా చేస్తాడని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మూడేళ్ళ క్రితమే మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చేది అట. క్రాక్ సినిమా సమయంలో రవితేజ కి ‘డాకు మహారాజ్’ మూవీ స్టోరీ ని వినిపించాడట బాబీ. ఈ స్టోరీ విన్న తర్వాత అంతా బాగానే ఉంది కానీ, గతం లో ఇలాంటి సబ్జెక్టు తోనే నేను ‘కిక్ 2’ చేశాను. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్ళీ అదే ఫార్మటు లో సినిమా తీస్తే జనాలు చూస్తారంటావా అని బాబీ ని అడిగాడట రవితేజ. కమర్షియల్ గా భారీగా ఈ చిత్రం ఉంటుంది సార్, ఆ చిత్రానికి దీనికి పోలిక రాకుండా చూసుకుంటా అని అన్నాడట డైరెక్టర్ బాబీ.

    ‘సరే చేద్దాం..ప్రస్తుతం నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి..అవి పూర్తి అయ్యాక ఆలోచిద్దాం’ అని అన్నాడట రవితేజ. అయితే ఈలోపే చాలా మారాయి. డైరెక్టర్ బాబీ కి మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ సినిమానే ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తర్వాత వెంటనే బాలయ్య బాబు తన సినిమాకి బాబీ ని బుక్ చేసుకోవడం, ఆ సమయంలో ఆయన ‘డాకు మహారాజ్’ స్టోరీ ని వినిపించడం, దానికి వెంటనే బాలయ్య ఓకే చేయడం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఫలితం అందరికీ తెలిసిందే. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ కి ఇలాంటి సూపర్ హిట్ చిత్రం పడుంటే ఆయన కెరీర్ కి ఎంతో బూస్ట్ అందేది అని ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు బాధ పడుతున్నారు.