Manchu’s Family : సంక్రాంతి పండుగ శుభదినాలలో కూడా మంచు కుటుంబం లో వివాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఉదయం మంత్రి నారాలోకేష్ తో సుదీర్ఘంగా 20 నిమిషాల పాటు చర్చలు జరిపి, అనంతరం 200 మందితో కలిసి భారీ ర్యాలీ గా మంచు మనోజ్ విద్యానికేతన్ యూనివర్సిటీ కి బయలుదేరాడు. అక్కడ ఆయన తన అవ్వా తాతల సమాధులకు నివాళి అర్పించేందుకు రాగా యూనివర్సిటీ స్టాఫ్ మనోజ్ ని, అతని సతీమణి మౌనిక ని అడ్డుకుంది. దీంతో మనోజ్ తనని లోపలకు అనుమతించకపోతే ఇక్కడే బైఠాయిస్తానని చెప్పుకొచ్చాడు. కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు బందోబస్తుతో మూడవ గేట్ నుండి మనోజ్, మరియు అతని భార్య మౌనికలను లోపలకు తీసుకెళ్లాడు. అయితే దీనిని మోహన్ బాబు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాడు. కోర్టు ఆదేశాల ప్రకారం మనోజ్ యూనివర్సిటీ లోపలకు అడుగుపెట్టకూడదు, కానీ అతని 200 మందితో కలిసి యూనివర్సిటీ లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేసాడు.
కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు మనోజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి కౌంటర్ గా నేడు మనోజ్ కూడా తన తండ్రి మోహన్ బాబు పై ఫిర్యాదు చేసాడు. జనగిరి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసిన ఆయన, అనంతరం మీడియా తో మాట్లాడుతూ ‘నా కూతురు పుట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి పెద్ద పండుగ ఇది. నా తల్లితండ్రుల ఆశీస్సులు దక్కాలని ఇంటికి వెళ్తే నన్ను రానివ్వలేదు. చివరికి పండుగ రోజున నా తాత అవ్వల సమాధులకు నివాళి అర్పించడానికి నేను నా భార్య యూనివర్సిటీ కి వెళ్తే అక్కడ కూడా అడ్డుకున్నారు. నా ప్రాధమిక హక్కులను అడ్డుకోవడానికి ఎవరికీ అధికారం లేదు. అందుకే ఫిర్యాదు చేయడానికి వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.
నారా లోకేష్ తో భేటీ గురించి ఆయన మాట్లాడుతూ ‘సాధారణంగానే ఆయన్ని కలిశాను..అంతకు మించి ఏమి లేదు. మా కుటుంబ సమస్యల గురించి ఆయన దగ్గర ఎలాంటి ప్రస్తావన తీసుకొని రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. మీడియా తో మాట్లాడిన తర్వాత మనోజ్ స్వల్పంగా అస్వస్థతకి గురయ్యాడు. కడుపులో ఎడమవైపు తీవ్రమైన నొప్పి రావడం తో కుప్పకూలాడు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ వెనుక కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరాడు. అయితే కన్నకొడుకు పై మోహన్ బాబు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడని, ప్రపంచంలో కొడుకు మీద పోలీసులతో కఠినంగా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చిన మొట్టమొదటి తండ్రిగా మోహన్ బాబు చరిత్రలోకి ఎక్కడని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ మోహన్ బాబు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరికొంత మంది అయితే మోహన్ బాబు ని సమర్థిస్తూ మనోజ్ తన భార్య తో కలిసి లోపలకు వెళ్తానంటే మోహన్ బాబు కూడా వద్దు అనడు. కానీ ఆయన తన వెంట 200 మందిని వేసుకొని వచ్చాడు. లోపలకు వాళ్ళను అనుమతిస్తే అల్లర్లు సృష్టిస్తారు, అందుకే మోహన్ బాబు ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యాడు అంటూ మరికొంతమంది నెటిజెన్ల మాట్లాడుతున్నారు.