Aadikeshava: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో వైష్ణవ తేజ్ ఒకరు. ఈయన చేసిన ఉప్పెన సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది.ఆ తర్వాత ఆయన చేసిన కొండ పొలం, రంగ రంగ వైభవంగా అనే సినిమాలు మాత్రం అంత పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంక దాంతో ఆయన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో ఆది కేశవ అనే సినిమా చేశాడు.
ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తో ముందుకెళ్తుంది. ఇలాంటి క్రమంలోనే దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ కథని ముందుగా వేరే హీరోతో చేద్దామనుకొని వైష్ణవ్ తేజ్ తో చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను చూసిన చాలామంది జనం వైష్ణవ్ తేజ్ అనవసరంగా ఈ సినిమా చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి ముందుగా వేరే హీరోతో ఈ సినిమా చేయాలనుకున్నాడు అయితే ఆ హీరో ఎవరు అంటే మెగా ప్రిన్స్ గా పిలవబడే వరుణ్ తేజ్ అని తెలుస్తుంది…
ఈ సినిమా లో వైష్ణవి తేజ్ తన నటన పరంగా మెప్పించినప్పటికీ కథ,కథనం లో దమ్ము లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ అవి ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో తెలియకుండా ఉండడంతో ఈ సినిమాని బోయపాటి తీసిన వినయ విధేయ రామ, స్కంద లాంటి సినిమాలతో పోలుస్తూ ఈ సినిమా మీద చాలా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి వైష్ణవ్ తేజ్ ఈ సినిమా లో డీసెంట్ అటెంప్ట్ ఇచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం అతనికి డిజాస్టర్ రిజల్ట్ ని ఇచ్చింది.
అయితే ఈ విషయంలో మొత్తం మిస్టేక్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దగ్గరే జరిగింది అంటూ అభిమానుల దగ్గర్నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.ఇక వైష్ణవ్ తేజ్ కాకుండా ఈ సినిమాని వరుణ్ తేజ్ చేసినట్లయితే వరుణ్ తేజ్ ఖాతాలో మరో డిజాస్టర్ అనేది చేరేది ఆయన కొంచం లో తప్పించుకున్నాడు అంటూ అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి వరుణ్ తేజ్ ని ఊహించుకొని శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని గాని, సినిమా స్టోరీని గాని రాసుకున్నట్టుగా గతంలో వివరించాడు… ఇక మొత్తానికి ఒక మెగా హీరో హాస్టల్ నుంచి తప్పించుకుంటే మరొక హీరో మాత్రం ఆ డిజాస్టర్ కి బలైపోయాడు…