Vallabhaneni Vamsi: ఏపీప్రాంతంలో వల్లభనేని వంశీ అరెస్టు(vallabhaneni Vamshi arrest) సంచలనంగా మారింది. గురువారం హైదరాబాదులో లోని రాయదుర్గం ప్రాంతంలో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల విజయవాడ తీసుకొచ్చారు. సత్య వర్ధన్ ను అపహరించిన ఘటనలో ఆయనను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. బహుశా ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్టు తెలుస్తోంది.
వల్లభనేని వంశీ అరెస్టును దేవినేని అవినాష్ ( devineni Avinash) ఖండించారు.. దేవినేని అవినాష్ దివంగత దేవినేని నెహ్రూ (devineni Nehru) కుమారుడు. దేవినేని అవినాష్ 2019లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. నాడు ఆయన ప్రత్యర్థిగా కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని పై అవినాష్ ఓటమిపాలయ్యారు. ఆ ఓటమి తర్వాత అవినాష్ వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అవినాష్ ఓటమిపాలయ్యారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును అవినాష్ తప్పు పడుతున్నారు. ప్రభుత్వం పస లేని కేసులో అరెస్టు చేసిందని.. వంశీ అరెస్ట్ కోర్టులో నిలబడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు.
నాడు దేవినేని నెహ్రూ ఏమన్నారంటే
దేవినేని అవినాష్ వల్లభనేని వంశీ అరెస్టును ఖండించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఒక్కసారిగా పాత ఆధారాలను బయటకు తీసింది. నాడు దేవినేని నెహ్రూ బతికి ఉన్న రోజుల్లో వల్లభనేని వంశీ పై చేసిన విమర్శలకు సంబంధించిన ఒక వీడియోను బయటపెట్టింది. ఆ వీడియోలో దేవినేని నెహ్రూ వల్లభనేని వంశీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ” నువ్వు పరిటాల రవికి సిగరెట్లు మోసే వాడివి. నువ్వు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అరాచకాలకు పాల్పడేవాడివి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం నాకే ఇబ్బందిగా ఉంది. నేను టిడిపిలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో.. గతంలో నీ వ్యవహార శైలి ఎలా ఉండేది? నువ్వు ఎవరిని ముంచి ఎలా ఎదిగావో మర్చిపోయావా? నీ గురించి చెప్తుంటేనే నాకే ఇబ్బందిగా ఉంది. విమర్శించాలంటేనే చిరాకు కలిగిస్తున్నది.. అలాంటి వ్యక్తివి నువ్వు. నీ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు మనస్కరించడం లేదని” దేవినేని నెహ్రూ వ్యాఖ్యానించారు.. టిడిపి సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను బయటపెట్టిన నేపథ్యంలో.. వైసిపి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతోంది. గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన విమర్శల తాలూకు పేపర్ కటింగ్స్ ను వైసీపీ నాయకులు పోస్ట్ చేస్తున్నారు.
దేవినేని నెహ్రు బ్రతికిఉండగా, వంశీ పేరు పలకాలి అంటేనే నాకు చిరాకు అన్నాడు..
నెహ్రు కొడుకు అవినాష్ ఏమో, వంశీ మద్దతు ఇస్తున్నాడు pic.twitter.com/voLctNGNTi— Bhavya (@unexpected5678) February 13, 2025