Allu Arjun rejected movie: గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చేసిన నటుడు అల్లు అర్జున్… ఆ మూవీ సక్సెస్ సాధించినప్పటికి ఆయనకు హీరోగా ఎలాంటి గుర్తింపైతే రాలేదు. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఆర్య సినిమాతో అతను హీరోగా నిఎడొక్కున్నాడు. యూత్ ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ రావడం విశేషం… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతనితో పోటీపడే హీరోలు మరెవరు లేరనెంత స్థాయిలో గుర్తింపైతే సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమా పాన్ ఇండియాలో భారీ క్రేజ్ ను సంపాదించుకోవడం ఒకెత్తయితే ఆ క్రేజ్ ని వాడుకుంటూ ‘పుష్ప 2’ సినిమాని చేశాడు. ఇక పుష్ప మొదటి పార్ట్ ఇచ్చిన హైప్ ని టాప్ లెవెల్ లోకి తీసుకెళ్తూ ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో మరోసారి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. అతను ఏ విషయాన్నైనా సరే చాలా డీప్ గా తీసుకొని కష్టపడి దానికి ప్రతిఫలం దక్కేలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసమే తన సినిమాలో ఎంతటి కష్టమైన డాన్స్ మూమెంట్ అయిన సరే ఈజీగా నేర్చుకుని అలవోకగా చేసేస్తూ ఉంటాడు.
సినిమా కోసం విపరీతంగా కష్టపడతాడు. ఇక నటన విషయంలో కూడా పరిణీతిని చెందిన అల్లు అర్జున్ రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఇలానే కష్టపడితే తను టాప్ లెవెల్ కి వెళ్తాడు. ఇక అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో ఒక స్టార్ హీరో సూపర్ సక్సెస్ ని సాధించాడు.
నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా మొదట అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారట. కానీ అల్లు అర్జున్ ఆ కథకి నో చెప్పడంతో ఆ మూవీ ని నితిన్ తో చేసి సూపర్ సక్సెస్ ని సాధించారు. మొత్తానికైతే నితిన్ ఆ సినిమాతో 13 ఫ్లాప్ సినిమాలకు చెక్ పెడుతూ సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…