Ravi Teja remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న చాలామంది హీరోలు వాళ్ళకంటు గొప్ప సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి కొంతమంది మాత్రం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వెనకబడిపోయారు… రవితేజ లాంటి స్టార్ హీరో మొదట సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అతనికి పెద్దగా కలిసి రావడం లేదు. ఇక ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడం లేదు…
ఇక కొందరైతే రవితేజకు రెమ్యూనరేషన్ ఒక్కటే కావాలని, సినిమా కథల గురించి ఆయన అసలు పట్టించుకోవడం లేదనే కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ సక్సెస్ ల కోసం సినిమాలు చేయకుండా కేవలం డబ్బుల కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నాడు అంటూ తన అభిమానులు సైతం కామెంట్స్ చేసే స్థాయికి రవితేజ దిగజారిపోయాడనే చెప్పాలి.
ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో రవితేజకు వరుసగా ప్లాప్ లు వస్తున్నాయి. ఈ సమయంలో అతనికి గొప్ప విజయం దక్కితే తప్ప మరోసారి తన పూర్వ వైభవాన్ని చాటుకునే అవకాశం రాకపోవచ్చు. తన తోటి హీరోలందరు మంచి విజయాలను సాధిస్తుంటే ఆయన మాత్రం విజయాల బాటలో వెనకబడి పోయాడు.
ఇదంతా చూస్తున్న ప్రతి ఒక్కరూ రవితేజకు ఏమైంది ఎందుకని ఆయన నాసిరకం కథలతో సినిమాలను చేస్తున్నాడు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా జనవరి నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది…ఇక ఈ సినిమాతో అయినా సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…