Director career lost Mahesh Babu movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి చాలా గొప్ప క్రేజ్ ఉంది. మాస్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. ఇక తన కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించాడు. రాజకుమారుడు తో తనను తాను హీరోగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలతో గొప్ప విజయాలను సాధించి స్టార్ హీరో రేంజ్ ను అందుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధిస్తే తనకు పాన్ వరల్డ్ లో గుర్తింపు లభిస్తుందనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక మహేష్ బాబుతో సినిమాలను చేసిన చాలా మంది దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా ఎదిగితే ఒక దర్శకుడు మాత్రం స్టార్ డైరెక్టర్ నుండి కిందికి పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే తేజ… కెరియర్ స్టార్టింగ్ లో చిత్రం, నువ్వు నేను, జయం లాంటి వరుస మూడు సక్సెస్ లతో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన ఆయన ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘నిజం’ సినిమాతో బొక్క బోర్లా పడ్డాడు.
ఈ సినిమా ఆశించిన మేరకు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఇక అప్పటి నుంచి దాదాపు 13 సంవత్సరాల పాటు ఫ్లాప్ లను ఎదుర్కొన్న తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో ఒక సక్సెస్ దక్కింది. ఇక ఆ తర్వాత కూడా ఆయన వరుస ప్లాప్ లను చవిచూస్తున్నాడు. ఇక మొత్తానికైతే టాప్ డైరెక్టర్ గా ఉన్న తేజ నిజం సినిమా చేసి తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయాడని చాలా మంది చెబుతుంటే, మరికొంత మంది మహేష్ అభిమానులు మాత్రం తేజ ఈ జనరేషన్ కు తగ్గటుగా అప్డేట్ అవ్వడం లేదు అందుకే ఆయనకు సక్సెస్ లు రావడం లేదు…
దానికి మహేష్ బాబు ఏం చేస్తాడు అంటూ మహేష్ ను సపోర్ట్ చేస్తూ ఇంకొంత మంది మాట్లాడుతుండటం విశేషం… మొత్తానికైతే నిజం తర్వాత తేజ చిన్న హీరోలతో సినిమాలను చేసుకుంటూ వస్తూనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు… ఇక ఇప్పటికైనా ఆయన మంచి సినిమాను చేసి మరోసారి కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…