Maa: ‘తెలుగు మా అధ్యక్ష పదవి’ మంచు విష్ణును వరించింది. హీరో మంచు విష్ణుకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని మొదటి నుంచి బలంగా చెబుతూ వచ్చిన నరేష్ చెప్పిన విధంగానే విష్ణు ఘన విజయం సాధించాడు. అయితే, ఇప్పుడు ఆ నరేష్ పై చాలా మందికి మంచి అభిప్రాయం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రధాన టార్గెట్ నరేషే. అయితే, ఓట్లు వేసే చిన్న నటీనటులలో మాత్రం నరేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తనకున్న పరిచయాల ద్వారానే విష్ణును గెలిపించాడు.

పైగా మంచు విష్ణుకి దగ్గర ఉండి మరీ ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించాడు. అయితే, ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడిన మాటల పై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సీరియస్ గా ఉంది. ముండమోపుల్లా ఎందుకు ఏడుస్తున్నారు ? అంటూ నరేష్ తనదైన శైలిలో కామెంట్స్ చేయడంతో ప్రకాష్ రాజ్ వెరీ సీరియస్ గా ఉన్నాడు.
అయినా ‘మా’ అధ్యక్షుడిగా విష్ణుకి బాధ్యతలు అప్పగించడానికి వెళ్లిన నరేష్.. ఇలా అడ్డమైన కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ‘మా’ ఒక సేవా సంస్థ అని చెప్పిన నరేష్.. ఆ సేవ చేయడానికి గొడవలు పడటం అవసరమా ? అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం అని చెప్పుకుని ఎన్నికలు అయిపోయాక, మళ్ళీ గొడవలు పడటానికి ఉత్సాహ పడటం ‘మా’ ప్రతిష్ఠకే మచ్చ.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయింది. అలాంటప్పుడు ఏమి చేయాలి ? కొత్త పాలకవర్గాన్ని ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా ఎన్నికల జరిగిన విధానం పై నాలుగు పేజీలు సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ డైలాగ్ లు రాసుకొచ్చి… ఒక్కొక్కరు చక్కగా నటిస్తూ చెప్పారు. దాంతో మోహన్ బాబు పై, నరేష్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్ళింది.
ఇందంతా విష్ణుని కచ్చితంగా డిస్టర్బ్ చేయడమే అవుతుంది. ఎన్నికల సమయంలో అందరం కలిసి పని చేద్దామని చెప్పి.. ఓడిపోయాక ఇలా మధ్యలో రాజీనామాలు చేయడం మంచి పద్ధతి కాదు. ‘మా’ ఎన్నికల కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాజుకున్న వేడిని ఇంకా రగిలిస్తూనే ఉండటం ఎవరికీ మంచిది కాదు.