https://oktelugu.com/

Sathyam Sundaram Collection: ‘సత్యం సుందరం’ మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు..సైలెంట్ గా వచ్చి ‘దేవర’ నే డామినేట్ చేసిందిగా!

'జపాన్' తమిళం తో పాటు, తెలుగు లో కూడా మంచి అంచనాల నడుమ విడుదలై పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. అంతకుముందు ఆయన నుండి విడుదలైన 'సర్దార్' చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ గా నిలిచి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 04:06 PM IST

    Sathyam Sundaram

    Follow us on

    Sathyam Sundaram Collection: టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న తమిళ హీరోలలో ఒకరు కార్తీ. ఆయన సినిమాలను ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎంతలా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. అంతే కాదు హీరో కార్తీ ని తమ సొంత తెలుగు హీరోలాగా చూస్తారు. అలాగే కార్తీ రేంజ్ తెలుగు ని చాలా మంది టాలీవుడ్ హీరోలు కూడా మాట్లాడలేరు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ఆయన గత చిత్రం ‘జపాన్’ తమిళం తో పాటు, తెలుగు లో కూడా మంచి అంచనాల నడుమ విడుదలై పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. అంతకుముందు ఆయన నుండి విడుదలైన ‘సర్దార్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ గా నిలిచి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై తెలుగు, తమిళ ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే.

    ఈ చిత్రం లో కార్తీ తో పాటు అరవింద్ స్వామి కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఒక పాపులర్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఈయన గతం లో విజయ్ సేతుపతి తో ’96’ అనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అవ్వడంతో, తెలుగు లో ఈ చిత్రాన్ని శర్వానంద్- సమంత కాంబినేషన్ లో ‘జాను’ చిత్రంగా తెరకెక్కించారు. ఇక్కడ పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉండగా ‘సత్యం సుందరం’ చిత్రం సైలెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకొని వసూళ్ల పరంగా తమిళనాడు వంటి ప్రాంతాల్లో ‘దేవర’ కలెక్షన్స్ ని సైతం డామినేట్ చేసింది. వారం రోజుల్లో ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ లో 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందట. అలాగే తెలుగు, తమిళ భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి వారం 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    పాటలు, ఫైట్స్, హీరోయిన్, యాక్షన్ లేని ఒక సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. మన ఆడియన్స్ కి ఒక మంచి సినిమాని అందిస్తే నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు అనడానికి ‘సత్యం సుందరం’ చిత్రం ఒక ఉదాహరణగా నిల్చింది. ‘దేవర’ చిత్రం తదుపరి వారం లో బాగా డ్రాప్ అవ్వొచ్చు, కానీ సత్యం సుందరం చిత్రం స్థిరమైన వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచే వసూళ్లను రాబడుతుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత వరకు చేరుతుందో చూడాలి. 100 కోట్ల రూపాయిల గ్రాస్ అయితే కష్టమే కానీ, మరో 20 కోట్ల రూపాయిలు అదనంగా రాబట్టే అవకాశం ఉంది.