Lucky Bhaskar Collections : ‘సీతారామం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, దుల్కర్ సల్మాన్ తెలుగు లో హీరోగా నటించిన రెండవ చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై మొదటి ఆట నుండే భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. సహజత్వానికి దగ్గరగా, ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు కనెక్ట్ అయ్యేలాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి ‘క’,కే ‘అమరన్’ చిత్రాలతో పోలిస్తే హైదరాబాద్ వంటి సిటీస్ లో ఆక్యుపెన్సీలు బాగా తక్కువగా ఉంది. కారణం నిర్మాత అత్యుత్సాహంతో భారీ టికెట్ రేట్స్ పెట్టడం వల్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆడియన్స్ కి మూడు ఆప్షన్స్ ఉన్న సమయంలో ఇలా టికెట్ రేట్స్ పెంచేస్తే, ఎవరైనా తక్కువ రేట్స్ ఉన్న సినిమాకే టికెట్స్ తెంపుతారు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ కి అదే మైనస్ అయ్యింది.
అంతే కాకుండా కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాల్లో జనాల్లో పాజిటివ్ టాక్ ‘లక్కీ భాస్కర్’ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇది కూడా ‘లక్కీ భాస్కర్’ కి పెద్ద మైనస్. ఆక్యుపెన్సీలు అయితే తగ్గాయి, బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఓవరాల్ గా మూడు రోజులకు గాను పర్వాలేదు అనే రేంజ్ లో రాబట్టింది. ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మూడు రోజులకు 4 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ లో కోటి రూపాయిలు, ఆంధ్ర ప్రదేశ్ లో 3 కోట్ల 22 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు కలిపి 8 కోట్ల 82 లక్షల షేర్ వసూళ్లు , 14 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 11 కోట్ల రూపాయలకు జరగగా, ఇక కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళ లో 6 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు లో 2 కోట్ల 30 లక్షలు, కర్ణాటక లో 2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 80 లక్షలు, ఓవర్సీస్ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం వర్షన్స్ కి కలిపి ఈ సినిమాకి 35 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూళ్లు, 17 కోట్ల 60 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. 28 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ కి ఇంకా 10 రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. నేడు కచ్చితంగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రానున్నాయి, మొదటి వారం లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు