Cinema Bandi Movie: నెట్ ఫ్లిక్స్ లో విపరీతమైన ఆదరణ పొందిన సినిమా ‘సినిమా బండి’. అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా భారీ చిత్రాల కంటే.. ఎక్కువ ఆదరణ పొందడం నిజంగా విశేషమే. అసలు ఈ ‘సినిమా బండి’ ఎలా హిట్ అయింది ? అసలు ఈ సినిమాలో ఏముంది ? వాస్తవానికి ఈ సినిమాలో హీరోతో ట్రైన్ మీద ఫైట్లు లేవు. ఇక హీరోయిన్ అర్ధనగ్న ప్రదర్శనలు లేవు. అలాగే పచ్చి బూతులతో ఐటమ్ సాంగ్ లు లేవు.

అలాగే వచ్చి రాని తెంగ్లిష్ భాష కూడా లేదు. మరి ఇవేమీ లేకుండా వచ్చిన ఈ చిత్రం అఖండ విజయం సాధించడం గొప్ప విషయం. అయితే, ఇవేమీ లేకపోయినా మరి సినిమాలో ఏముంది ? అచ్చంగా ఒక పల్లెటూరు వెళ్తే అక్కడ మనుషుల మధ్య తిరుగుతూ ఉంటే ఏలా ఉంటుందో అలా హాయిగా ఉంటుంది ఈ సినిమా చూసినప్పుడు.
ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే, సినిమా చూస్తున్నంత సేపూ ఎంతో గొప్పగా అనిపించాయి. పైగా ఈ సినిమాకి మరో బలం యాస. ఇంతవరకు 99% సినిమాలు ఆంధ్ర యాస, లేదా తెలంగాణ యాసతో వచ్చినవే, కానీ ఈ చిత్రంలో యాస మాత్రం పూర్తిగా కొత్తది. అందుకే చాలా కొత్తగా అనిపించింది. ప్రమోషన్స్ చేయకపోయినా జనం సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్ సినిమాలోని రాజమౌళి చెప్పిన రహస్యాలివీ
దానికి తగ్గట్టుగానే సినిమాలో ప్రతి ఒక్కరి నటన చాలా సహజంగా ఉంటుంది. అందరికంటే అందులో ఉన్న తాత పాత్ర మహా గొప్పగా పేలింది. ఏదో ఒక హావ భావం అందరూ పలికించటం ఒక ఎత్తు, సినిమా మొత్తం ఒకటే ఎక్స్ ప్రెషన్ ను క్యారీ చేయటం కొందరు హీరోల తర్వాత ఆ తాత పాత్రకే చెల్లింది ఆ పాత్ర చాలా బాగుంది.
ఇక అన్ని ఎమోషన్స్ ను సినిమాలో బాగా చూపించారు. ఒక చిన్న పల్లెటూరులో ఉండే వాళ్ళు అందరూ కలిసి ఒక సినిమా తీసే ప్రయత్నమే ఈ సినిమా. గ్రామీణ భాష వినసొంపుగా ఉంది. సినిమా తీసే మొదట్లో వాళ్ళు పడ్డ పాట్లు బాగా నవ్వించాయి. అలాగే పాత్రలను పరిచయం చేసిన విధానం బాగుంది. అందుకే ప్రమోట్ చేయకపోయినా సినిమా గొప్ప విజయం సాధించింది. అయినా కంటెంట్ ఉన్న సినిమాకి ప్రమోషన్ అవసరం లేదు.
Also Read: సినిమా పరిశ్రమపై ఎందుకు ద్వేషం అంటూ సిద్ధార్థ్ ట్వీట్..