Rakhi Special: వారం గ్యాప్ లో విడుదలైన ‘రాఖీ’,’అన్నవరం’ చిత్రాలు… ఏ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయో తెలుసా!

రాఖీ చిత్రం డిసెంబర్ 22 , 2006 వ సంవత్సరంలో విడుదల అవ్వగా, అన్నవరం చిత్రం డిసెంబర్ 29 వ తారీఖున విడుదలైంది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎదురుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ కి రాఖీ చిత్రంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. కానీ కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా ఆడలేదు.

Written By: Vicky, Updated On : August 19, 2024 12:25 pm

Rakhi Special

Follow us on

Rakhi Special: టాలీవుడ్ లో చెల్లి సెంటిమెంట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, సూపర్ హిట్ అయ్యాయి కూడా. ముఖ్యంగా పాత సినిమాల్లోని అన్నాచెల్లెళ్ళ బంధానికి సంబంధించిన సన్నివేశాలను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా, సహజంగా ఉంటుంది. నేటి తరం హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ మాత్రమే ఈ సెంటిమెంట్ మీద సినిమాలు చెయ్యగా పవన్ కళ్యాణ్ ఒక్కడే సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాతో, జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాతో అలాగే మహేష్ బాబు అర్జున్ సినిమాతో ఈ సెంటిమెంట్ టచ్ చేసారు. అయితే అప్పట్లో అన్నవరం, రాఖీ చిత్రాలు కేవలం ఒక వారం రోజుల గ్యాప్ లో విడుదల అయ్యాయి అనే విషయం చాలా మందికి తెలియదు.

రాఖీ చిత్రం డిసెంబర్ 22 , 2006 వ సంవత్సరంలో విడుదల అవ్వగా, అన్నవరం చిత్రం డిసెంబర్ 29 వ తారీఖున విడుదలైంది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎదురుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ కి రాఖీ చిత్రంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. కానీ కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా ఆడలేదు. ఎన్టీఆర్ లుక్స్ ఈ చిత్రంలో బాగాలేకపోవడం వల్లనే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదని అప్పట్లో టాక్ వినిపించేది. కానీ ఈ చిత్రంలోని పాటలు, ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ అన్నవరం చిత్రానికి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా లాంగ్ రన్ లో బాగా పికప్ అయ్యింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మాస్ సెంటర్స్ లో అయితే అన్నవరం కి ఉన్నటువంటి రికార్డ్స్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం ‘జల్సా’ కి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ రెండు సినిమాలలో అన్నవరం కి భారీ వసూళ్లు రాగా, రాఖీ చిత్రానికి అంతంత మాత్రంగానే వసూళ్లు వచ్చాయి. ఓపెనింగ్స్ విషయంలో అప్పట్లో అన్నవరం మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ తర్వాతి స్థానంలో నిల్చింది. ఆరోజుల్లోనే ఈ సినిమా మొదటి రోజు 4 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

మొదటి వారం లో ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రానికి ఫుల్ రన్ లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే రావడం గమనార్హం. మరోపక్క అన్నవరం చిత్రానికి ఫుల్ రన్ లో దాదాపుగా 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది, కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. అలా సూపర్ హిట్ టాక్ తో మొదలైన రాఖీ చిత్రం బిలో యావరేజ్ అవ్వగా, ఫ్లాప్ టాక్ తో మొదలైన అన్నవరం చిత్రం సూపర్ హిట్ గా నిల్చింది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలు వారం వ్యవధిలో విడుదల అవ్వడం కూడా ఈ రెండు సినిమాలకు మాత్రమే జరిగింది.