Hari Hara Veeramallu: ‘హరిహర వీరమల్లు’.. ఈ చారిత్రక యోధుడి కథను ఎంచుకొని ఏకంగా పవన్ కళ్యాణ్ పెట్టి ప్యాన్ ఇండియా లెవల్ లో తీద్దామని దర్శకుడు క్రిష్ ప్రారంభించాడు.కానీ ఏ ముహూర్తాన సినిమా మొదలైందో కానీ అన్నీ ఆటంకాలే. మొదట కరోనాతో సినిమా 50 శాతం పూర్తై ఆగిపోయింది. అనంతరం భీమ్లానాయక్ కోసం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ను పక్కనపెట్టారు.

దీంతో నిర్మాత ఏఏం రత్నం ఎంతగా గాబరాపడ్డాడో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలు, మధ్యలో వైరల్ ఫీవర్లు, అనారోగ్యాలు ఇలా ఉన్న టైం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దసరా నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో యాత్ర చేపట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో ఉన్న రెండు మూడు నెలల టైంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తి చేయాలి. లేదంటే భారీ బడ్జెట్ చిత్రం పూర్తికక నిండా మునగడం ఖాయం.
అందుకే ఇప్పుడు అదే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు ఆగిపోయిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. వచ్చే నెలలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. పవన్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట.. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా కనిపించనుంది. ఎఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
17వ శతాబ్ధానికి చెందిన ఈ కథకు అనుగుణంగా ఇప్పటికే ఆ కాలంలోని నిర్మాణాలకు సంబంధించిన సెట్స్ వేశారు. ఇప్పుడు వచ్చే నెలలో పవన్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు రెడీ అయ్యారు. క్రిష్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నారు.దసరా తర్వాత పవన్ యాత్ర మొదలుపెట్టబోతుండడంతో అది పూర్తవుతుందో? లేక ఎన్నికల వరకూ సాగుతుందో తెలియదు. అందుకే ఫుల్ డేట్స్ ‘హరిహర వీరమల్లు’కు ఇచ్చేసి అది పూర్తి చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలిసింది.
సినిమా ఆగిపోయిందని.. 50 కోట్ల నష్టం అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు షూటింగ్ మొదలుకాబోతోందన్న వార్త అటు నిర్మాతలను, ఇటు పవన్ అభిమానులకు ఊరటనిచ్చినట్టైంది.
[…] […]