Mahesh Babu Wig: సూపర్ స్టార్ కృష్ణ మరణం తరువాత ఆయనకు సంబంధించిన ప్రతీ విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఆయన జుట్టు గురించి హాట్ టాపిక్ అయింది. కృష్ణ గారిది సహజంగా బట్టతల. దీంతో ఆయన సినిమాల్లో విగ్గు వాడేవారు. అయితే ఆయనకు మేకప్ మెన్ గా చివరి వరకు పనిచేసింది మాధవరావు గారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి ఆయన చివరి సినిమా ‘శ్రీశ్రీ’ వరకు మాధవరావే మేకప్ మెన్ గా పనిచేశారు. అయితే కృష్ణ తో తనకున్న అనుబంధాన్ని మాధవరావు ఇటీవల మీడియాతో పంచుకున్నారు. మిగతా టెక్నీషియన్ల కంటే మేకప్ మెన్ చాలా దగ్గరగా ఉంటారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు గురించి పరిశీలిస్తే.

కృష్ణ మరణించినప్పుడు కూడా మాధవరావు పక్కనే ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని తుడిచి చివరిసారిగా మేకప్ మెన్ అనుబంధాన్ని తీర్చుకున్నారు. ఆ తరువాత తనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే కృష్ణ కు జుట్టు ఉన్నప్పటి నుంచే విగ్గు వాడేవారు అని ఆయన పేర్కొంటున్నారు. ‘అసాధ్యుడు’ సినిమాకు కృష్ణ మొదటిసారిగా విగ్గు వాడారు. ఇది కృష్ణకు బాగా షూటవడంతో అప్పటి నుంచి అదే స్టైల్ విగ్గుతో సినిమాల్లో కనిపించారు. అయితే విగ్గు పెట్టడం వల్ల కృష్ణ జుట్టు ఊడుతూ వచ్చింది. అలా బట్టతల గా మారింది. అయినా ఏమాత్రం ఆందోళన చెందకుడా సినిమాల కోసం విగ్గు పెట్టుకునేవారు.
Also Read: Actress Jeevitha Rajasekhar: జీవితా రాజశేఖర్ జస్ట్ మిస్… కానీ మేనేజర్ దొరికిపోయాడు!
కృష్ణ కుమారుడు మహేశ్ బాబు కూడా సినిమాల్లో విగ్గు వాడుతున్నట్లు మాధవరావు తెలిపారు. మహేశ్ బాబుకు మేకప్ మెన్ గా తన మేనల్లుడు పట్టాభి పనిచేస్తన్నాని అన్నారు. మహేశ్ బాబు తలపై పలుచటి వెంట్రుకలు ఉంటాయి. దీంతో ఆయనకు ప్రతీ సినిమాలో విగ్గు వాడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇక కృష్ణ పలు సందర్భాల్లో తనకు ఎంతో మేలు చేసేవారని, మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకునేవారని మాధవరావు తెలిపారు.

ఇలా కృష్ణకు సంబంధించిన ప్రతీ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. ఆయనతో పనిచేసిన వాళ్లు కృష్ణ గురించి అనేక విషయాలు మీడియాకు అందిస్తున్నారు. ఇక ఇటీవలే కృష్ణ ఆస్థికలను మహేశ్ బాబు పలు ప్రముఖ నదుల్లో కలిపారు. ఆ తరువాత చిన్న కర్మను చేశారు. ఈ సందర్భంగా కృష్ణ తో గడిపిన కృణాలను మహేశ్ గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Anasuya Bharadwaj: వైరల్ గా అనసూయ మేకప్ లెస్ లుక్… ఒరిజినల్ గా ఇలా ఉంటుందా?
