Nani Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మిగతా హీరోలందరు కూడా వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నాని కెరియర్ మొదట్లో సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ దసర సినిమా నుంచి ఆయన మాస్ హీరోగా అవతారం ఎత్తి కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దసర సినిమాతో మంచి డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో కలిసి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాతో మరోసారి వీళ్ళిద్దరు వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గిఫ్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్యారడైజ్ లాంటి సినిమా మరొకటి రాదు అంటూ శ్రీకాంత్ ఓదెల కామెంట్స్ అయితే చేస్తున్నాడు.
Also Read: కెరియర్ మొదట్లో మోహన్ బాబు చేతిలో దెబ్బలు తిన్న నాని…అసలేం జరిగిందంటే..?
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందంటూ వాళ్ళ అభిమానులు సైతం భారీ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్యారడైజ్ సినిమా నుంచి రీసెంట్ గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంతో పాటు వ్రాప్డ్ మ్యూజిక్ ను కూడా రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం అయితే చేశారు.
ఇక నాని లాంటి స్టార్ హీరో ఈ సినిమాలో చేస్తున్న జడల్ క్యారెక్టర్ లో అతనికి జడల్ వేసి ఉంటాయి. ఆ జడల్ ఎవరైనా ముట్టుకుంటే తట్టుకోలేడట. మరి జడల్ వేసుకోవడానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందంటూ శ్రీకాంత్ ఓదెల దాని మీద కూడా ఒక సీన్ అయితే రాసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మీదట నాని ఏ సినిమా చేసిన కూడా అదొక మంచి సినిమాగా నిలిచి పోవాలనే ఉద్దేశ్యంతో ఆయన టైమ్ తీసుకొని మరి కొన్ని సినిమాలను చేస్తున్నట్టుగా తెలుస్తోంది…