Nani And Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరూ చేయనటువంటి డిఫరెంట్ పాత్రలను చేస్తూ విలక్షణమైన నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో మోహన్ బాబు… కలెక్షన్ కింగ్ గా తనన్న ఐడెంటిటిని కాపాడుకుంటూనే తన తోటి హీరోలందరికి పోటీని ఇస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది బెస్ట్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు చాలా తక్కువే అయినప్పటికి చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా తన కొడుకుల సినిమాల్లో నటిస్తూ ఆ సినిమాకి వీలైనంత వరకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన నాని హీరోగా వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు… అయితే ఈ మూవీలో ‘మోహన్ బాబు ఒక పెద్ద రౌడీ గా ఉంటాడట…అప్పుడే నాని ఆ గ్యాంగ్ లో చేరుతాడట…గ్యాంగ్ లో చేరిన మొదట్లో రౌడీ అంటే ఎలా ఉండాలో నాని కి తెలియకపోతే మోహన్ బాబు నాని కి తెలిసేలా చెప్పే ప్రయత్నం చేస్తాడట…ఈ ప్రాసెస్ లోనే ఆయన నాని ని కొడతాడట’…ఇక రీసెంట్ గా షూట్ చేసిన షెడ్యూల్లో ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటిని మించి పోయేలా ఈ పాత్ర ఉండబోతుందట. ఇక దానికి తగ్గట్టుగానే చాలా కేర్ ఫుల్ గా ఈ పాత్రను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రసంగం ప్రణాళిక ప్రకారమే ఇచ్చాడా..? టీడీపీ నే టార్గెట్ చేశాడా?
మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో మోహన్ బాబుని మనం ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూడబోతున్నాం అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
మరి దానికి తగ్గట్టుగానే మోహన్ బాబు నాని ని కొట్టిన తర్వాత నాని తిరిగి మోహన్ బాబుని కొడతాడా? లేదంటే ఇంకేదైనా జిమ్మిక్కు చేయబోతున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తానికైతే సోషల్ మీడియా మొత్తం మోహన్ బాబు నాని ని కొట్టాడు అంటూ ఒక వార్త అయితే విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన వార్త అని చాలామంది చర్చించుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా నాని మాస్ హీరోగా మారడానికి ప్యారడైజ్ సినిమా అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకుంటాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…