Rashmi Gautam: జూనియర్ ఆర్టిస్ట్ నుంచి యాంకర్ గా మారి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ‘రష్మీ గౌతమ్’. అయితే, ఆ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లాలని గత కొన్నేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. రష్మీ గౌతమ్ జాతకం మాత్రం మారడం లేదు. మధ్యలో చిన్నాచితకా చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. అయితే, ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు పోయాయో కూడా ఎవరికీ తెలియదు.

అయినా రష్మీ గౌతమ్ మాత్రం తాను ఫలానా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నాను అంటూ ఇన్నాళ్లు తానొక హీరోయిన్ అనే యాంగిల్ లో ప్రమోట్ చేసుకునేది. అయితే, ఇప్పుడు ఆ సినిమాలు కూడా రష్మీ గౌతమ్ కి రావట్లేదు. ఆమె సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయిపోయింది. ఇటు బుల్లితెరపై కూడా ఆమెకు ఒకటి రెండు షోలు మాత్రమే ఉన్నాయి.
పైగా ఆ షోస్ లో కూడా ఆమె లీడ్ కాదు. మొత్తమ్మీద రష్మీ గౌతమ్ కి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడే రష్మీ ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. ‘భోళా శంకర్’ మేనేజర్ ను పట్టుకుని.. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ మెగా ఛాన్స్ పేరు చెప్పి.. మరో నాలుగు సినిమాలు కొట్టాలని రష్మీ ప్లాన్. అయితే, ఇండస్ట్రీలో టాక్ మాత్రం.. ‘భోళా శంకర్’ సినిమాలో రష్మీ గౌతమ్ ది ఐదు సెకన్లు కనిపించే ఒక ఐటమ్ పాత్ర అట.
Also Read: రష్మీ గౌతమ్ మళ్లీ అలా చేసి బుక్కైంది.
పైగా ఐటెం సాంగ్ కోరస్ లో రష్మీ గౌతమ్ కనిపిస్తోంది. పాటనే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఇక కోరస్ లో వచ్చే ఐటమ్ భామను ఎవరు పట్టించుకుంటారు ? అందుకే, మెగాస్టార్ సినిమా ‘రష్మీ గౌతమ్’కి ఏ రకంగానూ ఉపయోగపడేలా లేదు. ఇక తనకు సినిమాల్లో ఆఫర్లు లేకున్నా పర్వాలేదు అని, తాను ఎప్పుడూ ఒకేలా ఉంటాను అంటూ సింపతి మాటలు చెబుతుంది ఈ బ్యూటీ.
Also Read: మెగాస్టార్ సిస్టర్ గా రీఎంట్రీ.. సక్సెస్ అవుతుందా ?
ఇక ‘భోళాశంకర్’లో హీరోయిన్ల సంఖ్య ఎక్కవే. చిరు సరసన తమన్నా నటిస్తుంటే.. చిరుకి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఐటెం గర్ల్ గా లక్ష్మీ రాయ్ కనిపించనుంది. లక్ష్మీ రాయ్ పాత్రను పరిచయం చేసే చిన్న పాత్రలో రష్మీ కనిపించబోతుంది.