Balakrishna: ‘అఖండ’ విజయం తరువాత నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సంతోషాన్నంతా ఫ్యాన్స్ తో కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆయన హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ అనే ప్రొగ్రాంలో ‘అఖండ’ టీంతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ ప్రొగ్రాంకు బాలకృష్ణ హోస్ట్ గా ఉండగా.. డైరెక్టర్ బోయపాటి, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య సినిమాలోని కొన్ని డైలాగ్ లు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సినిమా గురించే కాకుండా రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న అంశంపై ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు…

ఎప్పుడూ ఫైర్ మెన్ గా కనిపించే బాలయ్య మొదటిసారి కన్నీళ్లతో కనిపించాడు. ‘అన్ స్టాపబుల్’ అనే ప్రొగ్రాంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ తనకు తెలియకుండానే ఎమోషనల్ అయ్యాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. ‘ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో నేనొకరిని. ఆయన సొంత కుమారుడిని. ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ అదంతా తప్పుడు ప్రచారం. ఎవరైనా ఇలా అన్నప్పుడల్లా నా కళ్లల్లోకి నీళ్లు వస్తాయి’ అనుకుంటూ బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ ను అలా అనేసరికి నాకు తెలియకుండా నేనే ఎమోషనల్ అవుతానని బాలయ్య అన్నాడు. అయితే ఇది త్వరలో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్’ అనే ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమో మాత్రమే. సోమవారం దీనిని రిలీజ్ చేశారు. దీంతో పూర్తి వీడియోలో బాలకృష్ణ ఇంకా ఏం విషయాలో చెప్పారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఈ ప్రొగ్రాంలో బాలయ్య నటిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
Also Read: S. V. Krishna Reddy: నిజమే.. ఆయన ఇంకొన్ని సినిమాలు తీసుంటే బాగుండేది !
ఇప్పటి వరకు మోహన్ బాబు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేశాడు. ఆ తరువాత హీరో నానితో మాట్లాడారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కూడా బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే ప్రొగ్రాం చేశారు. అయితే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.కానీ అఖండ మూవీ టీంతో చేసిన ప్రొగ్రాం ప్రోమో సోమవారం విడుదలై వైరల్ అవుతోంది. మొదటిసారి బాలయ్య కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఫ్యాన్స్ ఆ పూర్తి ప్రోగ్రాం కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read: నటనలోనే కాదు, దానాల్లోనూ ‘మహానటి’నే ఆమె !