https://oktelugu.com/

టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు వీరే..

సినీ స్టార్లు అభిమానం విష‌యంలోనే కాదు.. ఆస్తుల విష‌యంలోనూ అంద‌రికంటే పై స్థాయిలోనే ఉంటారు. వారి రెమ్యున‌రేష‌న్ కోట్లాది రూపాయ‌ల్లో ఉండడ‌మే ఇందుకు కార‌ణం. మిగిలిన న‌టీన‌టుల‌తో పోలిస్తే.. హీరోలు.. అందునా స్టార్ హీరోల పారితోషిక భారీగా ఉంటుంది. అయితే.. వారి సంపాద‌న ఎక్కువ‌గా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. అది మొత్తం ఎంత ఉంటుంద‌న్న‌ది మాత్రం జ‌నాల‌కు తెలియ‌దు. వారి స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం ప్ర‌కారం స్టార్ల ఆస్తుల వివ‌రాలు మీకోసం… Also Read: […]

Written By:
  • Rocky
  • , Updated On : March 10, 2021 / 10:08 AM IST
    Follow us on


    సినీ స్టార్లు అభిమానం విష‌యంలోనే కాదు.. ఆస్తుల విష‌యంలోనూ అంద‌రికంటే పై స్థాయిలోనే ఉంటారు. వారి రెమ్యున‌రేష‌న్ కోట్లాది రూపాయ‌ల్లో ఉండడ‌మే ఇందుకు కార‌ణం. మిగిలిన న‌టీన‌టుల‌తో పోలిస్తే.. హీరోలు.. అందునా స్టార్ హీరోల పారితోషిక భారీగా ఉంటుంది. అయితే.. వారి సంపాద‌న ఎక్కువ‌గా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. అది మొత్తం ఎంత ఉంటుంద‌న్న‌ది మాత్రం జ‌నాల‌కు తెలియ‌దు. వారి స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం ప్ర‌కారం స్టార్ల ఆస్తుల వివ‌రాలు మీకోసం…

    Also Read: ‘జానపదాని’కి పవన్ కళ్యాణ్ సన్మానం

    జూనియ‌ర్ ఎన్టీఆర్ః నంద‌మూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి ప్రవేశించిన తార‌క్‌.. త‌న‌దైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ‘నిన్ను చూడాల‌ని’ చిత్రంతో ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన జూనియ‌ర్‌.. సింహాద్రి, ఆది వంటి చిత్రాల ద్వారా స్టార్ గా మారిన జూనియ‌ర్‌.. ఆ త‌ర్వాత టాప్ హీరోగా కొన‌సాగుతున్నాడు. ఆయ‌న ఆ‌స్తుల విలువ సుమారు రూ.3,200 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.

    రామ్ చ‌ర‌ణ్ః మెగా వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ కూడా తండ్రి వార‌స‌త్వంతో వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు. ‘చిరుత’ చిత్రంతో వెండితెరపై మెరిసిన చెర్రీ.. మగధీరతో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత అపోలో హాస్పిటల్స్ వారసురాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ఆస్తులు చూస్తే.. దాదాపు రూ.3,000 కోట్లు ఉంటుంద‌ట‌.

    నాగార్జునః టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వార‌సుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ‘శివ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ్.. టాప్ రేంజ్ లోకి దూసుకెళ్లారు. ఆయ‌న సినిమాల‌తోపాటు ప‌లు బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఆ విధంగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్ర‌స్తుతం నాగ్ ఆస్తుల విలువ చూస్తే.. రూ.3,000 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం.

    Also Read: హృతిక్ రోషన్ తో పటాస్ తీస్తా.. అనిల్ రావిపూడి సంచలన ప్రకటన

    మ‌హేష్ బాబుః చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మ‌హేష్‌.. ‘రాజకుమారుడు’ సినిమా ద్వారా హీరోగా మారిపోయాడు. పోకిరి సినిమాతో సూపర్ స్టార్ గా మారిపోయిన మహేష్.. తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగులో హై రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోల్లో ఒక‌రిగా ఉన్నారు. ప్రిన్స్ ఆస్తుల విలువ చూస్తే.. రూ.2,800 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం.

    అల్లు అర్జున్ః మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మ‌రో హీరో అల్లు అర్జున్ సంపాద‌న కూడా భారీగానే ఉంది. గంగోత్రి సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన బ‌న్నీ.. ఆ త‌ర్వాత త‌న కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్లాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్తుల విలువ రూ.2,500 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని తెలుస్తోంది.

    మంచు విష్ణుః క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు వార‌సుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టాడు విష్ణు. త‌న పేరుతోనే తొలి సినిమా తీసిన మంచు వార‌సుడు.. ‘ఢీ’ ద్వారా భారీ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమాతో రాబోతున్నాడు. ఆయ‌న ఆస్తుల విలువ చూస్తే.. 1,900 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్