Mahesh Babu Rajamouli Movie Update: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో రాజమౌళి (Rajamouli) మొదటి స్థానంలో ఉంటాడు. ప్రభాస్ (Prabhas) తో చేసిన బాహుబలి (Bahubali) సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈయన మహేష్ బాబు తో ఇప్పున చేస్తున్న సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న ఆయన ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన రాజమౌళి ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం కెన్యాకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కొంత మంది పాన్ ఇండియా నటులు టించబోతున్నారట. వాళ్లు ఎవరు అనేది బయటికి చెప్పడం లేదు కానీ ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు ఆ పాత్రలను ఏ నటుడు పోషిస్తున్నాడు అనే విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అలాగే తను గత కొద్ది రోజుల నుంచి విజువల్ వండర్స్ ను క్రియేట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ నుండి తప్పుకున్న శ్రీలీల..డైరెక్టర్ తో గొడవలే కారణమా?
కమర్షియల్ సినిమాల రేంజ్ ని మార్చి భారీ బడ్జెట్ తో హ్యూమన్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ, ఎలివేషన్స్ ను పండిస్తూ ప్రేక్షకుడిచేత ఔరా అనిపించేలా సినిమాలు తీయడం అతనికి మాత్రమే సాధ్యమైందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా ఆయనకు కూడా చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. ఇప్పటివరకు ఆయన కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చేశాడు. ఒక్కసారిగా ఆయన 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2500 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు… ఇక ఈ షెడ్యూల్ గడిస్తే గాని ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఏంటి అనేది క్లారిటీగా తెలియదు…
Also Read: పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను దూరం పెట్టడానికి కారణం ఏంటంటే..?