భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ ఏమి చేసినా భారీ తనమే ఉంటుంది. గుణశేఖర్ ‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’ లాంటి మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు ఇటు చారిత్రాత్మక చిత్రాలను, ఇటు పురాణ చిత్రాలను తీస్తోన్న నేటి దర్శకుడు గుణశేఖర్ ఒక్కడే. ‘రామాయణం’తో మొదలైన తన జర్నీని ‘రుద్రమదేవి’తో మరో స్థాయికి తీసుకువెళ్లిన గుణశేఖర్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రధారిగా ‘శాకుంతలం’ తెరకెక్కిస్తున్నాడు.
నేడు గుణశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనూ ‘శాకుంతలం’ షూటింగ్ ను యాభై శాతం పూర్తీ చేశామని.. మే 10 వరకూ మేం షూటింగ్ చేశామని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఒంటి గంట వరకు ప్రభుత్వం నుంచి లాక్ డౌన్ వెసులుబాటు ఉంది కాబట్టి,
మరి త్వరలోనే రెండో షెడ్యూల్ ను కూడా మొదలుపెడతాడేమో చూడాలి. అయితే ఈ సినిమా ఇంత వేగంగా షూటింగ్ ను పూర్తి చేయడానికి కారణం సమంత అట. షూటింగ్ ఆలస్యమైతే నిర్మాతలకు నష్టం వస్తోందని, అందుకే తనకు ఇబ్బంది అయినా.. ముందుగానే సెట్ కి వస్తున్నానని చెప్పిందట. ఇక తన కుమార్తె ఈ చిత్ర నిర్మాత నీలిమ గుణ, చక్కని ప్లానింగ్ తో ‘శాకుంతలం’ షూటింగ్ ను జాగ్రత్తగా సెట్ చేస్తోందట.
ఇక ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో చరిత్ర, పురాణాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్న దర్శకుడు అంటే గుణశేఖర్ ఒక్కడే. ఈ విషయం గురించి కూడా గుణశేఖర్ క్లారిటీ ఇచ్చాడు. తనకు చిన్నప్పట్నుంచి మన పురాణాలమీద, చరిత్రమీద ఎక్కువ ఆసక్తి ఉండేది అని, వాటిల్లో బలమైన కంటెంట్ ఉంటుందని, అందుకే తాను ఆ కంటెంట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అంటూ గుణశేఖర్ తెలియజేశాడు