వ్యతిరేకంగా మాట్లాడితే కేసులా?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే. కేసులు పెడతారు. జైల్లో నెడతారు. అదేమంట రాజద్రోహం అని కేసు నమోదు చేస్తారు. ఇంతకీ ఈ కేసు ఇప్పటిది కాదు. బ్రిటిష్ కాలం నాటిది. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైల్లో పెట్టేవారు. మీడియానే కాదు కమెడియన్లన వదలడం లేదు. దీంతో ఇప్పుడు రాజద్రోహం కేసుల పేరుతో ప్రభుత్వాలు వ్యతిరేక స్వరాలను అణచివేయడం కోసం ఇటీవల కొంతమంది అధికారం చేతుల్లో ఉన్న వారు బరితెగిస్తున్నారు. సెక్షన్ 124ఏ ఇది బ్రిటిష్ […]

Written By: Srinivas, Updated On : June 2, 2021 3:12 pm
Follow us on

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే. కేసులు పెడతారు. జైల్లో నెడతారు. అదేమంట రాజద్రోహం అని కేసు నమోదు చేస్తారు. ఇంతకీ ఈ కేసు ఇప్పటిది కాదు. బ్రిటిష్ కాలం నాటిది. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైల్లో పెట్టేవారు. మీడియానే కాదు కమెడియన్లన వదలడం లేదు. దీంతో ఇప్పుడు రాజద్రోహం కేసుల పేరుతో ప్రభుత్వాలు వ్యతిరేక స్వరాలను అణచివేయడం కోసం ఇటీవల కొంతమంది అధికారం చేతుల్లో ఉన్న వారు బరితెగిస్తున్నారు.

సెక్షన్ 124ఏ ఇది బ్రిటిష్ కాలంలో అప్పటి పాలకులు స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేయడానికి పెట్టుకున్నసెక్షన్. స్వాతంత్ర్యం తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ లో కంటిన్యూ అవుతోంది. 124ఏ సెక్షన్ కింద రాజద్రోహం శిక్ష విధించవచ్చని ఇండియన్ పీనల్ కోడ్ లో ఉంది. కానీ హేట్ స్పీచ్ అనేదానికి నిర్వచనమే లేదు.ఏది హేట్ స్పీచ్ ఏది కాదు అన్న దానిపై స్పష్టత లేదు. దీన్నేప్రభుత్వాలు అధికారంలో ఉన్న వారు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు.

రాజద్రోహం సెక్షన్ ను ప్రభుత్వాలు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నాయి. కునాల్ కుమ్రా అనే కమెడియన్ విమానంలో వెళ్తుండగా ప్రధాని మోదీని తన కామెడీ స్టైల్ లో అనుకరించారని రాజద్రోహం కేసు పెట్టారు. యూపీలో జరిగిన హథ్రాస్ అత్యాచారం, హత్య ఘటనను రిపోర్టు చేయడానికి వెళ్లిన విలేకరిపై దేశద్రోహం కేసు పెట్టింది. ఇప్పటికి జర్నలిస్టు జైల్లోనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం అనురాగ్ కశ్యప్ తోపాటు కొంతమంది సినీప్రముఖులు దేశంలో పరిస్థితులపై ఓ లేఖను ప్రధానికి రాశారు. దాన్ని సెడిషన్ కింద పరిగణించేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ రాజద్రోహం కేసుల పాలైన ఉమర్ ఖాలిద్, కప్పన్, కన్నయ్య లాంటి విద్యార్థి నాయకులు కూడా బాధితులే చివరికి సోషల్ మీడియాలో విమర్శలు చేసినా సెడిషన్ కేసులు పెడుతున్నారు. వీటిని ఇలా వదిలేస్తే రేపు ప్రతిపక్ష నేతలు అనే వారిని లేకుండా రాజద్రోహం కేసులో జైల్లో పెట్టేసి నియంత పాలనను మన పాలకులు తీసుకొచ్చినా తీసుకొస్తారు. అందుకే రాజద్రోహం కేసులకు స్పష్టమైన నిర్వచనం రావాల్సి ఉంది.