Chiranjeevi – Krishna Vamsi: మన టాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ మరియు బ్లాక్ బస్టర్ మూవీస్ కి కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచినా డైరెక్టర్ కృష్ణ వంశి..ముఖ్యంగా సమాజాన్ని మేలుకొలిపే సినిమాలు మరియు కుటుంబ కథ చిత్రాలు తియ్యడం లో కృష్ణ వంశి గారికి పోటీ ఇచ్చే డైరెక్టర్ మరొకరు లేరు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఈయన తీసిన ఖడ్గం సినిమా ప్రతి ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజు కచ్చితంగా టీవీ లో టెలికాస్ట్ చేసే విషయం మన అందరికి తెలిసిందే..జనాల్లో ఈ సినిమా ఆ స్థాయి ఇంపాక్ట్ ని సృష్టించింది..ఇక పండుగ సమయాల్లో మురారి సినిమాని కూడా తప్పనిసరిగా వేస్తుంటారు..అలాంటి సినిమాలు ఎన్నో కృష్ణ వంశి కెరీర్ లో ఉన్నాయి..అయితే నేటి తరం పేక్షకులను అలరించడం లో ఆయన విఫలం అవుతూ ఉన్నారు..అందుకే ఆయనకీ సినిమా అవకాశాలు రావడం బాగా తగ్గిపోయాయి..ప్రస్తుతం ఆయన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ని ప్రధాన పాత్రలో పెట్టి ‘రంగమార్తాండ’ అనే సినిమా చేసాడు..ఇందులో ఆయనతో పాటు కామెడీ లెజెండ్ బ్రహ్మానందం గారు కూడా ప్రధాన పాత్ర పోషించారు..ఈ సందర్భంగా ఈ సినిమా కోసం ఇటీవల ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వూస్ లో కృష్ణ వంశి గారి మెగాస్టార్ చిరంజీవి తో తనకి ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
చిరంజీవి ని ఇండస్ట్రీ ఓ అందరూ ప్రేమగా అన్నయ్య అని పిలిచే సంగతి మన అందరికి తెలిసిందే..ప్రతి ఒక్కరు ఆయనతో అంత ఆప్యాయంగా ఉంటారు..అలాగే కృష్ణ వంశి కూడా చిరంజీవి గారిని ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవాడట..చిరంజీవి కూడా కృష్ణ వంశి గారిని తన సోదరులపై ఎలాంటి ప్రేమ కురిపిస్తారో కృష్ణ వంశి మీద కూడా అలాగే ప్రేమ కురిపించేవాడట ..వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరుకు అయితే సినిమా రాలేదు కానీ ఒక యాడ్ అయితే వచ్చింది..ఈ యాడ్ షూటింగ్ విరామం మధ్యలో కృష్ణ వంశి గారు తన యూనిట్ లో కొంతమంది తో చిరంజీవి గారు తనకి ఇష్టమైన వాళ్లకి కారు ని బహుమతిగా ఇస్తారట..నాకు కూడా ఇస్తారో లేదో చూద్దాం అని సరదాగా అన్నాను..ఒకరోజు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు.
Also Read: Sara Ali khan and Janhvi Kapoor: అన్నదమ్ములతో కలిసి డేటింగ్ చేసిన జాన్వీ కపూర్ – సరా అలీ ఖాన్
అన్నయ్య నుండి పిలుపు రావడం తో ఆరోజు షూటింగ్స్ కూడా ఆపి వెళ్ళాను..చాలాసేపు ముచ్చటించుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు అన్నయ్య నా చేతిలో కొత్త కారు కీస్ ని పెట్టాడు..’నీకే గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకోరా’ అన్నాడు..అయ్యే వద్దు అన్నయ్య పర్లేదు అని నేను అన్నాను..’అన్నయ్య అని అంత ప్రేమగా పిలుస్తున్నావు..ఈ అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ తీసుకోవా’ అని అన్నారు..అలా మొహమాటం తోనే ఆ గిఫ్ట్ ని స్వీకరించాను..ఆరోజు అన్నయ్య ఇచ్చిన ఆ గిఫ్ట్ ఈరోజు నా ప్రాణాలను కాపాడింది..ఇటీవల పనిమీద నందిగామ కి వెళ్లి వస్తున్నా సమయం లో నాకు ఘోరమైన కార్ యాక్సిడెంట్ జరిగింది..ఆరోజు నేను చిరంజీవి గారు గిఫ్ట్ గా ఇచ్చిన కారునే వాడాను..కార్ బాగా దెబ్బతినింది కానీ..నా వంటిమీద చిన్న గీత కూడా పడలేదు..అన్నయ్య రోజు బహుమతిగా ఇచ్చిన ఈ కారు నా ప్రాణాలను కాపాడింది అంటూ కృష్ణ వంశి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు
Also Read:Tollywood Bandh : తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఉపద్రవానికి కారకులెవరు?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: The reason i am alive today is because of chiranjeevi krishna vamsi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com