YS Jagan : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అందరికీ సుపరిచితమే. ఆయన ప్రారంభించిన కొన్ని సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన కొడుకే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌పీసీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. తర్వాత పరిణామాలతో జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఏపీ సీఎంగా పనిచేశారు. అయితే ఆయన అక్రమాస్తుల కేసులో జగన్ జైలుశిక్ష కూడా అనుభవించారు. అయితే ఈ కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ కేసుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ కేసులను బదిలీ చేయాలని, బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విషయంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసులకు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్నం, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రఘురామ కష్ణంరాజు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. జగన్ కేసులను ట్రయర్ కోర్టు, రోజువారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని, అందువలన మరో రాష్ట్రానికి బదిలీ చేయాలిసన అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే కేసుల విచారణ వేగవంతం చేయమని మాత్రం ధర్మాసనం ఆదేశించింది.
బెయిల్ రద్దుకు కారణాలు లేవే..
ఇక జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి ఎలాంటి కారణాలు లేవు. ఆ కేసుల్ని పర్యవేక్షించమంటూ రఘురామ కృష్ణంరాజు దాఖలుఏ చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫున లాయర్ కోరగా.. ధర్మాసనం అంగీకరించింది. దీంతో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
12 ఏళ్లగా విచారణ..
ఇదిలా ఉంటే జగన్ అక్రమాస్తుల కేసు 12 ఏళ్లుగా విచారణ జరుగుతోంది. ఒక్క డిశ్చార్జి పిటిషన్ కూడా డిస్పోజ్ కాలేదని రఘురామ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు గతంలోనే కేసుల బదిలీ సాధ్యం కాదని చెప్పిందని, కాబట్టి సుప్రీం కోర్టు ఈ కేసులను పర్యవేక్షించాలని కోరుతున్నామన్నారు. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. ఈ కేసులను హైకోర్టు మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. ఇంకా కేసులు అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని జగన్ తరఫు లాయర్ వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.