https://oktelugu.com/

Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా!

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రానికి డేట్స్ కేటాయిస్తాడని అందరూ అనుకున్నారు,సోషల్ మీడియా లో కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి కూడా ఇదే న్యూస్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 6, 2023 / 05:42 PM IST
    Follow us on

    Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎప్పుడో ‘వకీల్ సాబ్’ సినిమా సమయం లో సమాంతరంగా ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. మధ్యలో కరోనా లెకపొయ్యుంటే ఈ పాటికి పూర్తి అయ్యిపోయి ఉండేదేమో.

    కానీ లాక్ డౌన్ తీసివేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాకి కమిట్ అవ్వడం,ఆ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అలా ఎన్నో వాయిదాల నడుస్తున్న ఈ సినిమా ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ క్లైమాక్స్ సన్నివేశం కోసం పవన్ కళ్యాణ్ కేవెలం 30 రోజుల డేట్స్ ఇస్తే సరిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇంతలోపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు #OG మూవీ షెడ్యూల్స్ లో వరుసగా పాల్గొంటున్నాడు.

    ఈ నెలలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి డేట్స్ కేటాయిస్తాడని అందరూ అనుకున్నారు,సోషల్ మీడియా లో కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి కూడా ఇదే న్యూస్ వచ్చింది. హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో సెట్స్ కూడా నిర్మించి చాలా రోజులైంది. ఈనెల తో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయిపోతుంది అని అనుకుంటుండగా, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ కి కాకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండవ షెడ్యూల్ కి డేట్స్ కేటాయించాడు.

    అందుకు కారణం కూడా లేకపోలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రం పీరియడ్ డ్రామా, ఇందుకోసం ఆయన ఎలాంటి డీవియేషన్స్ లేకుండా లుక్స్ దగ్గర నుండి ప్రతీ ఒక్కటి చాలా శ్రద్ద వహించాలి. అందుకే ముందుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు #OG షూటింగ్స్ ప్రధాన భాగం పూర్తి అయ్యే వరకు ‘హరి హర వీరమల్లు’ సినిమాకి షిఫ్ట్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడట పవన్ కళ్యాణ్.