Prabhas Marriage: ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ప్రభాస్… వాళ్ల పెద్దనాన్న కృష్ణంరాజు అండతో ఇండస్ట్రీకి వచ్చిన ప్రభాస్ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు. వర్షం, చత్రపతి సినిమాలతో టాప్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం… ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో మరోసారి ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న ఆయన ఇకమీదట రాబోయే సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి. అంతే తప్ప ఏ ఒక్కరిని నిరాశపరిచే విధంగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఏరికోరి మరియు మంచి కంటెంట్లతో సినిమాలను చేస్తున్నాడు…
సినిమాలు చేయడంలో ఆయన చాలా ముందు వరుసలో ఉన్నప్పటికి తను పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 50 సంవత్సరాలకు దగ్గరవుతున్నప్పటికి అతను ఇంకా పెళ్లి మీద దృష్టి సారించకపోవడంతో అతని అభిమానులు ఎందుకని ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదంటే ఆయనకి సింగిల్ గా ఉండటం ఇష్టమట. సినిమా షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు మళ్లీ ఇంటిదగ్గర మన వాళ్లు ఉన్నారు కదా అని వాళ్ల కోసం వెంటనే షూటింగ్ అయిపోగానే ఇంటికి తిరిగి రావడం తనకు ఇష్టం ఉండదట. ఎక్కడికైనా వెళ్తే అక్కడ పూర్తిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటాడట. ఇక షూటింగ్స్ బిజీలో ఉంది వాళ్ళను పట్టించుకోకపోతే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.
అందుకే ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి సింగిల్ గా ఉంటున్నానని ఆయన తన సన్నిహితుల దగ్గర తెలియ చేస్తున్నాడట. మొత్తానికైతే ప్రభాస్ ఇకమీదట కూడా పెళ్లి చేసుకునే అవకాశం లేదంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…