Rajamouli Mahesh Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో ‘రాజమౌళి’ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం…ఇక ఇప్పుడు ‘మహేష్ బాబు’ తో కలిసి చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కోసం ఇండియాలో ఉన్న అన్ని భాషల నుంచి నటులను ఇందులో భాగం చేయాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే కన్నడ నటుడు అయిన ‘కిచ్చ సుదీప్’ ను ఇందులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్లో ఈగ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సుదీప్ విలనిజాన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించే ప్రయత్నం చేశాడు.దాంతో సుదీప్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది… ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కిచ్చ సుదీప్ ఈ సినిమాలో మహేష్ బాబు కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడట. మొదటి నుంచి చివరి వరకు సుదీప్ మహేష్ తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ గా ఉంటుందట. వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి అడ్వెంచర్స్ చేశారు. ఒకరికొకరు తోడుగా ఎలా నిలిచారు అనేది ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించబోతున్నారట. మరిదంతా చూస్తుంటే సుదీప్ పాత్ర మొదటి నుంచి చివరి వరకు పాజిటివ్ గానే ఉంటుందా లేదంటే నెగెటివ్ గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే వార్తలు కూడా వస్తున్నాయి.
మరి ఇలాంటి ఒక సెటిల్డ్ క్యారెక్టర్ కోసం సుదీప్ ను తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వేరే ఇతర నటులను కూడా తీసుకోవచ్చు కదా అంటూ కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈయన పాత్రలో వేరియేషన్స్ ఉంటాయా? ఉండవా అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది… రీసెంట్ గా కన్నడ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ సైతం తన పాత్ర మీద ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది…
ఇక దాంతో తను రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా కిచ్చ సుదీప్ ఈ సినిమాలో చేసినట్టయితే సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…