Bruce Lee: మార్షల్ ఆర్ట్స్ లో తనదైన సినిమాలు తీసి ప్రేక్షకులను సంపాదించుకున్న నటుడు బ్రూస్ లీ. ఫైటింగ్ లో మొదట చెప్పేది ఆయన పేరునే. ఇలా బ్రూస్ లీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బ్రూస్ లీ మరణంపై ఇన్నాళ్లు సందిగ్ధత ఏర్పడింది. బ్రూస్ లీ 1973 జులైలో 32 సంవత్సరాల వయసులో మెదడు వాు, సెరిబ్రల్ ఎడెమాతో మరణించాడు. ఎంటర్ ది డ్రాగన్ సినిమా ద్వారా మార్షల్ ఆర్ట్స్ ను పాపులర్ చేసిన బ్రూస్ లీ మరణంపై మిస్టరీ వీడింది. ఇన్నాళ్లుగా బ్రూస్ లీ మరణంపై అందరికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఎడెమాతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇంతవరకు బ్రూస్ లీ మరణం అపోహలమయంగా ఉండేది. తాజా నివేదికతో అనుమానాలు పటాపంచలయ్యాయి. గ్యాంగ్ స్టర్స్ హత్య చేశారని, విష ప్రయోగం జరిగిందని, వడదెబ్బ వల్ల చనిపోయాడని రకరకాల ప్రచారాలు వచ్చాయి. వైద్యులు వెల్లడించిన నిజాలతో ఇప్పుడు అన్ని క్లియర్ కావడంతో అన్ని రకాల సంశయాలు తేలిపోయాయి. బ్రూస్ లీ హైపోనాట్రేమియాతో మరణించాడని తేల్చారు. ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పడిపోయి అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో చనిపోయాడని తెలియజేశారు.
శరీరంలోని కణాలు, మెదడులోని కణాలు అసమతుల్యంగా ఉబ్బడంతో అధిక ద్రవాల ప్రభావం, గంజాయి వాడకం వంటి వాటితో మూత్రపిండాలు బలహీనమయ్యాయి. డ్రగ్స్, అల్కహాల్ వంటి వాటి వినియోగం కూడా అతడి మృతికి కారణాలుగా మారాయి. బ్రూస్ లీ చనిపోయేటప్పుడు ఒక మూత్ర పిండం పనిచేయలేదని చెబుతున్నారు. మోమియో స్టాసిస్ ను నిర్వహించడానికి నీరు బయటకు పంపకపోవడంతో మూత్ర నాళాలు పనిచేయలేదు. ఇది హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా(మెదడు వాపు) కి గురికావడంతో చనిపోయాడు.

బ్రూస్ లీ ఆ సమయంలో నీరు కావాలని అడిగాడు. అలసిపోవడంతో నీరు అతిగా తాగాడు. తరువాత మైకంలోకి వెళ్లాడు. తలనొప్పి వస్తుందని మూర్చపోయాడు. దీంతో బ్రూస్ లీ ని ఆస్పత్రికి చేర్చినా లాభం కనిపించలేదు. చనిపోయాడని నిర్ధారించారు. అలా బ్రూస్ లీ శకం అంతమైంది. ఆయన తన మనుగడలో ఎన్నో వ్యయప్రయాసలు పడ్డాడు. సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో రకాలుగా తన ప్రస్థానం కొనసాగించాడు. ది వాటర్ మై ఫ్రెండ్ అనే కోట్ ను బ్రూస్ లీ తరచుగా చెబుతుండేవాడు. నీరే అతడి మరణానికి కారణం అయినట్లు వైద్యులు వెల్లడించారు.