Victory Venkatesh: ఒక్కోసారి తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ‘అయ్యో బంగారం లాంటి అవకాశాన్ని మిస్ అయ్యమే’ అని అనిపించేలా చేస్తుంది..అలాంటి సందర్భమే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు మోహన్ లాల్ కి ఎదురైంది..మోహన్ లాల్ హీరో గా నటించిన దృశ్యం సినిమా అప్పట్లో పెద్ద సెన్సషనల్ హిట్..ఈ సినిమాని తెలుగులో వెంకటేష్, తమిళం లో కమల్ హాసన్ మరియు హిందీ లో అజయ్ దేవగన్ చేసారు..అన్ని బాషలలో మంచి హిట్ గా నిలిచింది.

దీనికి సీక్వెల్ గా లాక్ డౌన్ సమయం లో దృశ్యం – 2 పేరిట మోహన్ లాల్ మలయాళం వెర్షన్ ని OTT లో విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఆ తర్వాత అదే సినిమాని తెలుగు లో వెంకటేష్ రీమేక్ చేసి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు..ఇక్కడ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది..ఇదే సినిమాని అజయ్ దేవగన్ హిందీ లో రీమేక్ చేసి ఇటీవలే వరల్డ్ వైడ్ గా ఘనంగా థియేటర్స్ లో విడుదల చేసాడు..రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో వచ్చింది.
రీసెంట్ గా బాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి..ఇక బాలీవుడ్ పని అయిపోయిందని అనుకుంటున్న సమయం లో దృశ్యం – 2 అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..అక్కడ కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 76 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది..ఇలా బాలీవుడ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టడం చూసి చాలా కాలమే అయ్యింది..సీక్వెల్స్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ అలాంటిది..వీక్ డేస్ లో కూడా ఈ చిత్రానికి కలెక్షన్స్ తగ్గడం లేదు..ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే ఫుల్ రన్ లో కచ్చితంగా 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఉన్న ఈ చిత్రాన్ని అనవసరంగా OTT లో విడుదల చేసి మంచి రెవిన్యూ ని వదులుకున్నారంటూ వెంకటేష్ మరియు మోహన్ లాల్ ఫాన్స్ సోషల్ మీడియా లో ఆరోపిస్తున్నారు..వెంకటేష్ దృశ్యం – 2 చిత్రం విడుదల అయ్యింది అనే విషయం బయట చాలా మందికి తెలియదు..ఇప్పటికి మునిగిపోయింది ఏమి లేదని..దయచేసి ఈ సినిమాని థియేటర్స్ లో మంచి ప్రోమోషన్స్ చేసి విడుదల చెయ్యండి అంటూ ఫాన్స్ కోరుతున్నారు..మరి ఫాన్స్ కోరికని ఆ చిత్ర నిర్మాత సురేష్ బాబు పట్టించుకుంటాడా లేదా అనేది చూడాలి.