The Raja Saab Closing Collections: ఈ సంక్రాంతికి విడుదలైన 5 సినిమాల్లో ట్రేడ్ ని బాగా నిరాశకు గురి చేసిన చిత్రం ‘రాజా సాబ్'(The Raja Saab Movie). ప్రభాస్(Rebel Star Prabhas), మారుతీ(Maruthi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ ట్రైలర్ తర్వాత ఏర్పడిన క్రేజ్ వేరు. మారుతీ ఎదో చిన్న సినిమా తీసాడని అనుకున్నాం, కుంభస్థలం బద్దలు కొట్టే రేంజ్ సినిమా తీసాడని అభిమానులు బలంగా నమ్మారు. కానీ అభిమానుల అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. అదే సమయం లో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదలై అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏకైక ఛాయస్ గా ఆ చిత్రం నిల్చింది. ఇక ఆ సినిమా తర్వాత విడుదలైన మూడు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో ‘రాజా సాబ్’ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా రెండు వారాలకే క్లోజింగ్ కలెక్షన్స్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్లను ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి 48 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ విడుదల తర్వాత కేవలం 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. వచ్చిన డిజాస్టర్ టాక్ కి ఈ మాత్రం షేర్ రావడం చాలా గొప్ప. ప్రభాస్ కాబట్టి అంత వచ్చింది, మిగతా హీరోలకు అయితే 30 కోట్ల కంటే తక్కువ వచ్చేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే సీడెడ్ నుండి 10.55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , ఉత్తరాంధ్ర నుండి 10.19 కోట్లు, తూర్పు గోదావరి నుండి 8 కోట్లు, పశ్చిమ గోదావరి నుండి 5.56 కోట్లు రాబట్టింది. అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 5.38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం కృష్ణా జిల్లా నుండి 5.52 కోట్లు రాబట్టింది.
ఇక నెల్లూరు జిల్లా లో అయితే 3.54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 117 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక ప్రాంతం నుండి 8.63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, తమిళనాడు + కేరళ నుండి కోటి 65 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 13.30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రభాస్ కి బలమైన మార్కెట్ గా పిలవబడే ఓవర్సీస్ నుండి కేవలం 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 120 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.