Ustaad Bhagat Singh: ‘ఓజీ’ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదలయ్యే చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని, ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది ఈ చిత్రం. ఫిబ్రవరి నెలలో మొదటి కాపీ ని సిద్ధం చేసి, మార్చి 26 న ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అనుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది చెప్పొచ్చు. అగ్నిపరీక్ష లాంటిది కూడా. ముందుగా ఈ సినిమాకు అనుకున్న టైటిల్ ‘భవదీయుడు భగత్ సింగ్’. స్టోరీ కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా కుదిరింది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి అసలు నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత వేరే వెర్షన్ తో వచ్చాడు హరీష్ శంకర్, కానీ అది కూడా నచ్చలేదు.
దీంతో ఆ కథని పూర్తి గా పక్కన పెట్టి ఒక రీమేక్ సినిమా చెయ్యాలని అనుకున్నారు. ఈ విషయం తెలియగానే అభిమానుల నుండి తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు రగిలాయి. సోషల్ మీడియా మొత్తం ఉడికిపోయింది. అభిమానుల నుండి వచ్చిన వ్యతిరేకతను గమనించిన మూవీ టీం రీమేక్ ఆలోచన పక్కన పెట్టి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే ఫ్రెష్ స్క్రిప్ట్ ని తీసుకొచ్చారు. అలా మొదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ మధ్యలో రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం వల్ల షూటింగ్ బాగా ఆలస్యం అయ్యింది. సుమారుగా మూడేళ్ళ పాటు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసి, ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ కోసం అందిస్తున్నాం. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆ రిఫరెన్స్ కోసమే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ని ఇరికించారా?, లేదా కథలో భాగంగానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రం లో శ్రీలీల తో పాటు రాశీ ఖన్నా కూడా మరో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈమె వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా ఈ చిత్రం లో కనిపించనుంది. హిస్టరీ చూసుకుంటే ఒక్క పుష్ప సిరీస్ తప్ప, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి బ్యాక్ డ్రాప్ ని ఎంచుకొని హరీష్ శంకర్ రిస్క్ చేస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మార్చి 26 వరకు ఆగాల్సిందే.