Prabhas First Film Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీని శాసిస్తున్న హీరో కూడా తనే కావడం విశేషం… ఇప్పటివరకు ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు బాహుబలి సినిమాతో వచ్చింది. ఆ సినిమా నుంచి అతను వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. పాన్ ఇండియా నేపద్యంలో వస్తున్న ప్రతీ సినిమాలో అతను డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వచ్చాడు. కారణం ఏదైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి అతని ఎదిగాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రభాస్ ఇప్పుడు వందల కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నాడు.
కానీ తన మొదటి సినిమా అయిన ఈశ్వర్ సినిమాకి మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ సినిమా కోసం ఆయన కేవలం 20 లక్షల రూపాయలను మాత్రమే రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారట… ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇంత పెద్ద స్టార్ హీరో అవుతాడని ఎవరు ఊహించలేదు.
మొత్తానికైతే మొదటి సినిమాతో అతనికి రావాల్సిన గుర్తింపైతే వచ్చింది. మాస్ హీరోగా మారబోతున్నాడు అంటూ ప్రతి ఒక్కరు అతన్ని కొనియాడారు. ఏది ఏమైనా కూడా మొదటి సినిమా అనుకున్న రేంజ్ లో ఆడకపోయిన ఆ తర్వాత వర్షం సినిమాతో అతను నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని చూపించాడు. ఆ సినిమా నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇక ప్రభాస్ సైతం తన నుంచి వచ్చే ఏ సినిమా మిమ్మల్ని నిరాశ పరచాడు అంటూ తన అభిమానులకు హామీ ఇస్తుంటాడు.
రీసెంట్గా వచ్చిన రాజాసాబ్ సినిమా సైతం ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంది… దర్శకుడు యొక్క మేకింగ్ అద్భుతంగా లేకపోవడంతో సినిమా కొంతవరకు నిరాశపర్చినప్పటికి ప్రభాస్ యాక్టింగ్ బాగుంది కాబట్టి అభిమానులు ఆ సినిమాను రిపీటెడ్ గా చూస్తున్నారు…