OG Movie Second Half: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కి మంచి ఊపుని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా విషయం లో అభిమానులకు కొన్ని అసంతృప్తి కరమైన విషయాలు ఉన్నాయి. ముందుగా మేకర్స్ ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తామని చెప్పి అభిమానులు మోసం చేశారు. ఈ చిత్రం తో 450 నుండి 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అవలీలగా కొట్టేస్తాము అనే ధీమా తో ఉండేవారు పవన్ ఫ్యాన్స్. కానీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ లేకపోవడం వల్ల కేవలం 320 కోట్ల తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో అసంతృప్తి కరమైన విషయం ఏమిటంటే, సెకండ్ హాఫ్ బలహీనంగా ఉండడం.
ఫస్ట్ హాఫ్ అభిమానులకే కాదు, మూవీ లవర్స్ కి కూడా చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్ కి అభిమానులు చొక్కాలు చింపుకొని గుండెలు బాదుకుంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ కి అలాంటి ఉత్సాహం ఒక్క అభిమాని లో కూడా కలగలేదు. పోలీస్ స్టేషన్ సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ రప్పించాయి. అలాంటి బ్లాక్స్ ఇంకో రెండు పెట్టుంటే, సినిమా లెవెల్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళేది. కానీ చాలా సింపుల్ గా పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ని వాడుకొని సినిమాని నడిపించాడు డైరెక్టర్ సుజీత్. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ కి ముందుగా అనుకున్న స్టోరీ ఇదైతే కాదట. ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత నేరుగా ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్ చేసి ,జపాన్ బ్యాక్ డ్రాప్ లో మిగిలిన సినిమా తీద్దామని అనుకున్నాడట డైరెక్టర్ సుజీత్.
అందుకోసం మూడు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా రాసుకున్నాడట. ఓజీ బాల్యం, అతని తండ్రి ఆజాద్ రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్ తరుపున పోరాడిన విధానం. అతనికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో ఉన్న స్నేహం , ఇలాంటి అంశాలన్నీ చూపించాలని అనుకున్నాడట డైరెక్టర్ సుజిత్. సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని కూడా డేట్స్ అడిగారట. ఆయన కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ జపాన్ లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని సమాచారం. సుజిత్ చాలా వరకు రిక్వెస్ట్ చేసాడట, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ససేమీరా నో చెప్పడంతో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చి, సింపుల్ గా తీయాల్సి వచ్చిందని అంటున్నారు. ఒకవేళ ముందు అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఈ చిత్రాన్ని తెరకెక్కించి, భారీ లెవెల్ లో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసుంటే వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత కెపాసిటీ ఉన్న సినిమా ఇది.