The Raja Saab Review: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ చేసిన ప్రతి సినిమా సక్సెస్ ని సాధిస్తుంది. సలార్, కల్కి లాంటి వరుస సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
దేవనగర సంస్థానానికి జమిందారు అయినటువంటి గంగాదేవి (జరీనా వహెబ్)…అంత గొప్ప లైఫ్ ను వదులుకొని తన మనవడు అయిన రాజాసాబ్ (ప్రభాస్) తో కలిసి ఒక సామాన్యురాలుగా బతుకుతుంది. రాజాసాబ్ అంటే నానమ్మ కి చాలా ఇష్టం…అలాగే నానమ్మ అంటే కూడా రాజాసాబ్ కి అమితమైన ప్రేమ… మాకోసం ఎవరు లేరు ఎవరు రారు మేమిద్దరమే అనుకునే రాజాసాబ్ చాలా సరదాగా తన లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు… నానమ్మ కి ఏజ్ పెరగడం తో మతిమరుపు వస్తుంటుంది.
అన్నింటిని మర్చిపోతుంటుంది. కానీ తన భర్త అయిన కనకరాజ్ (సంజయ్ దత్) మాత్రం రోజు తనకి కలలోకి వస్తాడు. ఆ విషయాన్ని రాజసాబ్ కి చెబుతుంది…అలాగే రాజసాబ్ ను ఎలాగైనా తన భర్తను తీసుకురమ్మని నానమ్మ కోరుతుంది…ఇక రాజాసాబ్ ఆ పనిలో ఉన్నప్పుడు వాళ్ల తాత అయిన కనకరాజ్ తన భార్య అయిన గంగాదేవిని తన మనవడు అయిన రాజాసాబ్ ను తన కోటలోకి రప్పిస్తాడు…అసలు కనకరాజ్ ఎందుకు దెయ్యం లా మారాడు…తన భార్య అయిన గంగాదేవిని, మనవడు అయిన రాజాసాబ్ ను ఎందుకు చంపాలనుకుంటాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు మారుతి తన కెరియర్ స్టార్టింగ్ లో ‘ప్రేమకథ చిత్రమ్’ అనే ఒక హార్రర్ మూవీని తెరకెక్కించాడు. ఇక అదే జానర్లో ఈ సినిమాని సైతం తీశాడు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించడం వల్ల ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్ ఇంతకుముందు చేయనటువంటి కొత్త జానర్ లో ఈ సినిమా చేశాడు. కాబట్టి మొదటి నుంచి సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే మారుతి ఈ కథని బాగా రాసుకున్నప్పటికి స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. సినిమా ఫస్టాఫ్ మొత్తం బోరింగ్ గా సాగుతుంది.
సెకండాఫ్ అయినా బాగుంటుందా? అంటే అది కూడా గాడి తప్పుతుంది. మధ్య మధ్యలో బోర్ కొట్టించే సన్నివేశాలు… ఇంతకుముందు సినిమాల్లో చూసిన సీన్లు రిపీటెడ్ గా వస్తూ ఉండడం వల్ల ఒకరకంగా సగటు ప్రేక్షకులకు కొంతవరకు అది చికాకు పెట్టించే అవకాశమైతే ఉంది… ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకుడికి హై ఇచ్చినప్పటికి సెకండాఫ్ అదే రేంజ్ లో స్టార్ట్ చేయడంలో మారుతి తడబడ్డాడు.
స్క్రీన్ మీద ప్రభాస్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు అనే విషయం మనకు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది… సెకండాఫ్ లో వచ్చే కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికి ఆ తర్వాత అదే ఊపును కంటిన్యూ చేయడంలో ఆయన డీలా పడ్డాడు. ఇక సంజయ్ దత్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే ప్రభాస్ ఆ కోటలోకి ఎంటర్ అయ్యే సన్నివేశాన్ని సైతం చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడు… ఆయన కోటలోకి వచ్చిన తర్వాత మళ్లీ నార్మల్ సీన్లే రావడంతో ఈ మాత్రం దానికి ప్రభాస్ ఈ సినిమాలో చేయాల్సిన అవసరం ఏముంది? వేరే మీడియం హీరోతో కూడా ఈ సినిమాను చేయొచ్చు కదా అనే ఫీల్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది…
ఇక్కడ క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే సిజీ వర్క్ ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుడిని సాటిస్ఫై చేసే విధంగానే ఉంటుంది… ఇక ఓవరాల్ గా సినిమా బిట్లుగా చూస్తే ఓకే అనిపించినప్పటికి అదంతా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చూసినప్పుడు మాత్రం ప్రభాస్ రేంజ్ సినిమా కాదనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది… ప్రభాస్ సైతం చాలా రోజుల తర్వాత కామెడీని చేశాడు కాబట్టి అతని అభిమానులకు కొంతవరకు ఈ సినిమా నచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కానీ సగటు ప్రేక్షకులు మాత్రం ఫస్టాఫ్ లోనే ఈ సినిమా నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అక్కడక్కడ మెరుపులు మెరూపించినప్పటికి సినిమా ఓవరాల్ గా చాలా వరకు డల్ అయిందనే చెప్పాలి…
దాదాపు మూడు సంవత్సరాల పాటు చేసిన ఈ సినిమాని బాగా తీసి ఉంటే మారుతికి మంచి పేరు వచ్చి ఉండేది. ఇక తమన్ మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. హారర్ ఎపిసోడ్స్ ని బాగా ఎలివేట్ చేసిన తమన్ ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఏమాత్రం తన ఇంపాక్ట్ ని చూపించలేకపోయాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఒంటి చేత్తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడని చెప్పాలి. ప్రభాస్ తప్ప ఈ సినిమాలో ఎవరు పెద్దగా మెప్పించలేకపోయారు. ఇక ప్రభాస్ శీను, సప్తగిరి, సత్య, వీటీవీ గణేష్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళ కామెడీ కొంతవరకే పరిమితమైంది. ఇక అది కూడా రొటీన్ కామెడీ అనిపించింది…
ఇక హీరోయిన్లు మాళవిక మోహనన్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో పర్లేదు అనిపించింది… నిధి అగర్వాల్ పాటలకు మాత్రమే పరిమితమైంది… రిద్దీ కుమార్ ఈ సినిమాలో ఎందుకు నటించిందో కూడా అర్థం కాదు…సంజయ్ దత్ పాత్ర బాగుంది…ఘోస్ట్ గా ఆయన కొన్ని సన్నివేశాల్లో బాగా భయపెట్టారు…ఇక జరీనా వహీదా సైతం చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ను ఇచ్చింది…
టెక్నికల్ అంశాలు
మ్యూజిక్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా బాగుండేది…పాటలు ఒకే అయినప్పటికి వినడానికి ఆ లిరిక్స్ అర్థంకావడం లేదు… ఇక సినిమాటోగ్రఫీ పర్లేదు… ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో అలాగే క్లైమాక్స్ లో డిఓపి వర్క్ బాగుంది… సీజీ వర్క్ ఉన్నంతలో ఒకే అనిపించింది… ప్రొడక్షన్ వాల్యూస్ సైతం బాగున్నాయి…
మూవీలో బాగున్నవి…
ప్రభాస్ యాక్టింగ్
ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మూవీలో బాగోలేనివి
రొటీన్ కథ…
స్క్రీన్ ప్లే ఎఫెక్టివ్ గా లేదు…
అక్కడక్కడ డైరెక్షన్ బాగాలేదు…
రేటింగ్ : 2.25/5
చివరి లైన్ : హార్రర్ మూవీస్ నచ్చేవాళ్ళు, ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే ఒకసారి చూడచ్చు…