https://oktelugu.com/

The Raja Saab Movie : ది రాజా సాబ్ ను ఖంగారు పెట్టిస్తున్న ఆ ముగ్గురు హీరోల సినిమాలు…

ఇప్పటివరకు తన కెరీర్లో చిన్న సినిమాలను మాత్రమే చేసిన మారుతి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా హారర్, కామెడీ జోనర్లలో దర్శకుడు చూపించబోతున్నాడు. ఈ విషయం తెలిసిన డార్లింగ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Written By:
  • Mahi
  • , Updated On : January 7, 2025 / 03:43 PM IST

    Raja Saab movie

    Follow us on

    The Raja Saab Movie :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో చిన్న సినిమాలను మాత్రమే చేసిన మారుతి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా హారర్, కామెడీ జోనర్లలో దర్శకుడు చూపించబోతున్నాడు. ఈ విషయం తెలిసిన డార్లింగ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10, 2025 ప్రేక్షకుల ముందుకు రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు జత కడుతున్నారు. ది రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ది రాజా సాబ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హీరో ప్రభాస్ తో తనకు ఉన్న స్నేహం కారణం గానే నయనతార ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఏడాది ఏప్రిల్ 10న ది రాజా సాబ్ సినిమా విడుదల అవుతుందని గతంలో ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

    అయితే అదే రోజున హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ సినిమా కూడా ఏప్రిల్ 10న విడుదల కానుందని ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ది రాజా సాబ్ సినిమా వాయిదా వేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ వార్త విన్న డార్లింగ్ అభిమానులు కొంత నిరాశకు లోనవుతున్నారు.

    ఇది ఇలా ఉంటే ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరో గా ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్.ఆ తరువాత రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది.ఇక అప్పటి నుంచి ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తూ ఉండడం విశేషం.లేటెస్ట్ గా ప్రభాస్ సలార్,కల్కి 2898 ఎడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి.ఒకే సారి రెండు ప్రాజెక్ట్ లను ఓకే చేసి ప్రభాస్ అతి తక్కువ గ్యాప్ లోనే రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.