The Raja Saab Hindi Collection: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానులను ఏ రేంజ్ లో నిరాశపర్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఓపెనింగ్స్ అయితే బలంగానే వచ్చాయి. దాదాపుగా వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని మరోసారి అందుకుంటాడేమో అని అంతా అనుకున్నారు కానీ, 90 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ టాక్ ప్రభాస్ ఈ సినిమా మొదటి వీకెండ్ పై ఏ మాత్రం చూపించలేదు. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. కానీ నాల్గవ రోజు నుండి మాత్రం వసూళ్లు అతి దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూళ్ల గురించి మాట్లాడుకోవాలి. మన టాలీవుడ్ నుండి మొట్టమొదటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ మాత్రమే.
బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన కల్కి , సలార్ చిత్రాలు బాలీవుడ్ లో వందల కోట్ల నెట్ వసూళ్లను రాబట్టాయి. నెగిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న సాహూ, ఆదిపురుష్ చిత్రాలకు కూడా భారీ ఓపెనింగ్స్, భారీ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రాజా సాబ్’ చిత్రానికి దారుణం నుండి అతి దారుణమైన వసూళ్లు నమోదు అయ్యాయి. బాలీవుడ్ ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రం హిందీ వెర్షన్ నుండి మొదటి మూడు రోజులకు 15 కోట్ల 75 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజే బాలీవుడ్ లో 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న ప్రభాస్ కి, మూడు రోజులకు కలిపి కేవలం 15 కోట్ల రూపాయలకు పైగా నెట్ అంటే ఎంత అవమానకరమో మీరే అర్థం చేసుకోండి.
మూడు రోజుల్లో 15 కోట్లు అంటే, రోజుకి యావరేజ్ గా 5 కోట్లు అన్నమాట. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’ 38 వ రోజున హిందీ లో 6 కోట్ల 50 లక్షలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. దీనిని బట్టీ చూస్తే ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉండడం భూటకమేనా?, ఇన్ని రోజులు ప్రెస్టీజియస్ భారీ బడ్జెట్ ఈవెంట్ సినిమాలు చేస్తూ వచ్చాడు కాబట్టే ఆయనకు బాలీవుడ్ లో వసూళ్లు వచ్చాయా?, ఆయన స్థానం లో ఏ హీరో అలాంటి సినిమాలు చేసిన ఇదే రేంజ్ లో వసూళ్లు వచ్చేవా అనే అనుమానాలు ట్రేడ్ విశ్లేషకుల్లో మొదలయ్యాయి. చూడాలి మరి హిందీ లో ఈ చిత్రం క్లోజింగ్ కి ఎంత నెట్ వసూళ్లను రాబడుతుంది అనేది.