Anil Ravipudi: సౌత్ ఇండియా లో ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ మెలోడీస్ ని అందించి, మ్యూజిక్ ప్రియులను మంత్రముగ్దులను చేసిన ఇళయరాజా(ilayaraja), తన సినిమాల్లోని పాటలు వాడుకుంటున్నందుకు ఈమధ్య కాలంలో కేసులు వేయడం మనమంతా చూశాము. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో కూడా తన పాట వాడినందుకు మూవీ టీం పై పోలీస్ కేసు వేసాడు ఇళయరాజా. ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అజిత్ అభిమానులు అప్పట్లో ఇళయరాజా పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రంలో ఇళయరాజా పాట ఒకటి వాడారు. తలపతి చిత్రం లోని ‘సుందరి’ అనే పాటని ఉపయోగిస్తారు. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని కలిపే పాట ఇది.
ఈ పాటని ఉపయోగించుకున్నందుకు మీపై ఇళయ రాజా కేసులు వేశారా అని మీడియా నిన్నటి సక్సెస్ మీట్ లో అడిగిన ప్రశ్నకు, అనిల్ రావిపూడి(Anil Ravipudi) సమాధానం చెప్తూ ‘ చిరంజీవి, నయనతార లవ్ ట్రాక్ కోసం తలపతి లోని సుందరి పాటని బాగా ఉపయోగించుకున్నాం. సినిమాలో ఇది ది బెస్ట్ ఎపిసోడ్స్ లో ఒకటి. చాలా క్యూట్ గా ఉంటుంది. ఇళయరాజా గురించి మీకు ప్రత్యేకించి చెప్పాలి, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన పాటలు వాడుకునే కేసులు వేసేస్తారు అని అనుకుంటారు. ప్రతీ దానికి ఒక పద్దతి ఉంటుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు ,అంత గొప్ప మెజీషియన్ దగ్గరకు వెళ్లి సార్ మీ పాటని ఇలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము, మీ అనుమతి ఇస్తారా అని అడిగితే కచ్చితంగా ఒప్పుకుంటారు. మా నిర్మాతలు వెళ్లి ఇళయరాజా గారిని కలిసి, ఇలా మీ సినిమాలోని పాటని ఉపయోగించుకుంటామని అడిగారు, ఆయన అందుకు ఓకే చెప్పారు. కాబట్టి మాకు ఆయన కేసు వేసే ప్రమాదం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఈ ఈవెంట్ కి మూవీ టీం మొత్తం హాజరైంది కానీ, మెగాస్టార్ చిరంజీవి, నయనతార మాత్రం హాజరు అవ్వలేదు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సక్సెస్ అయ్యాక దాదాపుగా ఆరు ఈవెంట్స్ చేశారు. ఈ సినిమాకు కూడా అన్ని ఈవెంట్స్ చేస్తారో లేదో తెలియదు కానీ, అభిమానుల సమక్ష్యం లో భారీ గా ఒక ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యాలని సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మేకర్స్ ఆ ఈవెంట్ ని చేస్తారో లేదో చూడాలి.
ఇళయరాజా సాంగ్ వాడినందుకు కేసు వేశారా? డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ#AnilRavipudi pic.twitter.com/fvKnir5sqm
— Telugu360 (@Telugu360) January 13, 2026