The Raja Saab First Review: పాన్ ఇండియాలో గొప్ప పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్న వారిలో మన తెలుగు హీరోలు మొదటి స్థానంలో ఉన్నారు. మన వాళ్ళు చేసే సినిమాలన్ని గొప్ప విజయాలుగా నిలువడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నారు…ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ టాప్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన రాజాసాబ్ సినిమాతో ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఇప్పటికే ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకైతే చూపించారు. మరి దాన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ప్రభాస్ తన టీం తో కలిసి ఒక కోటలోకి ఉండే మిస్టరీ ని చేధించడానికి ఆ కోటకి వెళ్తాడు. ఆ కోటలో ఒక దెయ్యం ఉంటుంది. దాని నుంచి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇక అదే సమయానికి ప్రభాస్ ఆ దెయ్యం గా మారిన రాజుకి మనవడు అవుతాడని తెలుస్తుంది. అలాగే వాళ్లది రాజుల వంశమని తెలుసుకుంటాడు. ఇక అక్కడి నుంచి ప్రభాస్ తన టీం తో ఎలా బయటపడ్డాడు. తన తాత తన నుంచి ఏం కోరుకున్నాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది…
మారుతి ఈ సినిమా కథని చాలా సింపుల్గా రాసుకున్నప్పటికి సినిమాలోని సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా మలిచాడట… ప్రతి సీన్లో ప్రభాస్ తాలుకు ఆర ను చూపించే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే భయాందోళన కలిగించే సన్నివేశాలు సైతం ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఒక స్టార్ హీరో తో ఇలాంటి హర్రర్ సినిమా చేయించాలి అనుకోవడం ఒక రకం గా సాహసం అనే చెప్పాలి.
మారుతి ఘట్స్ కి మనం మెచ్చుకోవాలి. మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడంటు ఈ సినిమాను చూసిన చాలా మంది సినిమా మేధావులు చెబుతున్నారు. ఫైనల్ గా మారుతి ప్రభాస్ తో సక్సెస్ ని కొట్టబోతున్నాడా? లేదా అనే విషయం ప్రేక్షకులందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రభాస్ అభిమానులైతే ఈ సినిమా కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు.
కాబట్టి వాళ్లకి ఈ సినిమా ఒక విజువల్ ఫీస్టుగా అలరించబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా దెయ్యానికి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారంటూ ఈ సినిమాని చూసిన కొంత మంది చెబుతున్నారు…ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం జనవరి 9వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…