https://oktelugu.com/

Prashant Varma: ప్రశాంత్ వర్మ లో ఉన్న ఆ క్వాలిటీ ఈ స్టార్ డైరెక్టర్ లో లేదు…అందుకే వరుస ప్లాప్ లు వస్తున్నాయా..?

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం... ఇక్కడ సక్సెస్ అయితే పర్లేదు కానీ ఫెయిల్యూర్ గా మిగిలిపోతే మాత్రం చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది...అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా ఆలోచించి ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది...

Written By:
  • S Reddy
  • , Updated On : September 11, 2024 / 10:55 AM IST

    Prashant Varma

    Follow us on

    Prashant Varma: సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం దర్శకులకు ప్రేక్షకులు నిరాజనం పడుతున్నారు. ఎందుకంటే వాళ్లు చేసే సినిమాలు ఇప్పటి జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఆ దర్శకుల సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దీంతో కొంతమంది యంగ్ డైరెక్టర్స్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గిరాకీ అయితే పెరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు చాలా తొందరగా సినిమాలను చేస్తాడనే ఒక టాకైతే ఉంది. ఇక అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఒక మంచి సక్సెస్ ను కూడా సాధించాడు. నిజానికి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సాధించిన సక్సెస్ చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్ళబెట్టారు. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ తో మంచి ఔట్ పుట్ ని తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడు అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు.

    మరి ఇలాంటి సందర్భంలో ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కొన్ని ఎలివేషన్స్ సీన్స్ ని రాసుకుంటూనే ప్రేక్షకుడిని ఒక తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాడు. అందువల్లే ఆయన సినిమాలు ప్రేక్షకుడికి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. అయితే ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడి లో ఉన్న కొన్ని క్వాలిటీస్ అనేవి హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ లో కనిపించడం లేదు. అందుకే ఆయన సినిమాలు మెప్పించలేకపోతున్నాయి.

    ఇక రీసెంట్ గా రవితేజను హీరోగా పెట్టి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఆశించిన మేరకు ఆకట్టుకోవడం లేదు. అయితే హరీష్ శంకర్ ఎప్పుడు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలనే చేస్తున్నాడు. కొత్త కథలని తీసుకోవడం లేదు. గ్రాఫిక్స్ విషయానికొస్తే హరీష్ శంకర్ వాటితో సంబంధం లేకుండానే సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన సినిమాలకి ప్రేక్షకుడిలో అంత మంచి ఆదరణ అయితే దక్కడం లేదు…

    ఇక మొత్తానికైతే ఇప్పటికైనా హరీష్ శంకర్ తన పంథాను మార్చుకొని కొత్త తరం దర్శకులు ఎలాగైతే సినిమాలను చేస్తున్నారో అలాంటి సినిమాలనే హరీష్ శంకర్ కూడా చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు… చూడాలి మరి హరీష్ శంకర్ తన స్టైల్ ను మార్చుకుంటాడా లేదా అనేది…