Homeఎంటర్టైన్మెంట్Aura Of Ustaad song Promo: 'ఉస్తాద్ భగత్ సింగ్' 2వ పాట ప్రోమో వచ్చేసింది..దేవిశ్రీప్రసాద్...

Aura Of Ustaad song Promo: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2వ పాట ప్రోమో వచ్చేసింది..దేవిశ్రీప్రసాద్ నుండి ఇలాంటి బీట్ ఊహించలేదు!

Aura Of Ustaad song Promo: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyam), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ వచ్చే నెల 26న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి డిసెంబర్ నెలలో విడుదలకైనా ‘దేఖ్లేంగే సాలా’ పాటకు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూట్యూబ్ నుండి దాదాపుగా 50 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ పాట. ట్యూన్ యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడం తో, ఈ పాటకు ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే రెండవ పాటకోసం అభిమానులు ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది, ప్రొమోషన్స్ ఆలస్యం అవుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఫ్యాన్స్.

అభిమానుల నుండి ఒత్తిడి బాగా పెరిగిపోవడం శివరాత్రి రోజున ఈ సినిమా నుండి ‘#TheAuraOfUstaad’ పాటని ఫిబ్రవరి 22 మా విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆగ్రహానికి గురయ్యారు. రెడీ అయిపోయింది అంటూ ప్రతీ రోజు ప్రచారం చేస్తున్న ఈ పాటని విడుదల చేయడానికి అన్ని రోజుల సమయం ఎందుకు అంటూ కోపగించుకున్నారు. అభిమానుల ఆవేశాన్ని అర్థం చేసుకున్న మేకర్స్, కాసేపటి క్రితమే ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కి, ఆయన క్రేజ్ కి అంకితం చేస్తూ మంచి బీట్ ఉన్న పాటని కంపోజ్ చేసినందుకు ధన్యావాదాలు అంటూ ఈ ప్రోమో ని చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అభిమానుల్లో ఒకే ఒక్క అసంతృప్తి ఏంటంటే ఒక్క చరణం అయినా ప్రోమో లో పెట్టి ఉంటె బాగుండేది అని కొంతమంది అభిమానులు అంటున్నారు. మ్యూజిక్ బీట్, పవన్ కళ్యాణ్ లుక్స్ బాగానే ఉన్నప్పటికీ, పాట ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ఈ మ్యూజిక్ బిట్ ఏ మాత్రం సరిపోదని వాళ్ళ వాదన. అయితే ఈ పాటలోని లిరిక్స్ చాలా రోజుల క్రితమే సోషల్ మీడియా లో వదిలేశారు. ‘ఏ తరమైనా నీ తరమే ..మా గుండెలో నీ స్థానం సుస్థిరమే…’ అంటూ ఈ పాట కొనసాగుద్ది అట. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. చూడాలి మరి ఈ పాట ఆడియన్స్ ని ఏమేరకు అలరించబోతుంది అనేది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular