Producers Worried About Extra Cost: స్టార్ హీరోల రెమ్యూనిరేషన్ల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. ఫలానా హీరో 40 కోట్లు, కాదు మా హీరో 50 కోట్లు అంటూ నిత్యం సోషల్ మీడియా పుకార్లమయం అయిపోయింది. అయితే.. హీరోల రెమ్యూనిరేషన్ల కంటే కూడా.. నిర్మాతలు మరో విషయంలో ఇప్పుడు భయపడుతున్నారు. హీరోల అదనపు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయట. ముక్యంగా స్టయిలిష్ లు, హెయిర్ స్టయిలిష్ లు, కాస్ట్యూమ్ లు ఇలా సమస్తం నిర్మాతల జేబులకు చిల్లులు పెడుతున్నాయట.
చాలా వరకు ప్రభాస్, చరణ్, మహేష్, బన్నీ ఇలా హీరోలు అంతా తమ తమ స్టయిలిష్ ల కోసం ముంబై మీద ఆధారపడుతున్నారు. ముంబై టెక్నీషియన్స్ తెలుగు హీరోలు అనేసరికి రోజుకు లక్షల్లో చార్జ్ చేస్తున్నారు. పైగా రాను పోను భారీ ఖర్చులు కూడా. ఉదాహరణకు బన్నీ – సుకుమార్ పుష్ప 2 సినిమా కోసం హెయిర్ స్టయిలిష్ ను ముంబై నుంచి పిలిచారు.
Also Read: Thank You Movie Review: రివ్యూ : “థాంక్యూ”
హెయిర్ స్టయిలిష్ వచ్చినపుడు రోజుకు లక్షన్నర రెమ్యూనరేషన్ అని మాట్లాడుకున్నారు. కానీ, రాను పోను బిజినెస్ క్లాస్ టికెట్ లు, పైగా ఆ హెయిర్ స్టయిలిష్ కి పర్సనల్ గా ముగ్గురు సిబ్బంది, దానికి తోడు వారి టికెట్ లు ఇలా లెక్కకు మించి ఖర్చు వస్తోంది. అయినా నిర్మాతలు సర్దుకుపోయారు. ఆయితే, తాజాగా వారందరి హోటల్ బిల్ చూసి మైత్రీ మేకర్స్ నోరెళ్లబెట్టారు.
వారందరికీ స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చారు. ఖర్చు భారీగా వచ్చింది. ఒక్క హెయిర్ కే ఇంత ఖర్చు అయితే, ఇక మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి ? అందుకే.. ఇప్పుడు ఈ ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు నిర్మాతలు. మరోపక్క శంకర్-రామ్ చరణ్ సినిమాకి కూడా ఇలాగే నడుస్తోంది వ్యవహారం.
ఒక్క బన్నీ, రామ్ చరణ్ లకే కాదు, ప్రభాస్, మహేష్ మిగిలిన టాప్ హీరోలు సినిమాలన్నటికి ఇదే వ్యవహారం. బన్నీ అలవైకుంఠపురంలో సినిమా టైమ్ లో బన్నీ స్టయిలిష్ ల కోసం భారీగా ఖర్చు పెట్టారు. అందుకే, హీరోల బొచ్చు కోసం బొచ్చులో ఖర్చులు తగ్గించాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.
Also Read:Liger Trailer: లయన్ కు, టైగర్ కు పుట్టిన క్రాస్ బీడ్ ‘లైగర్’.. ‘దేవరకొండ’ యాక్షన్ విశ్వరూపం