The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్’ మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు మేకర్స్. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అది సినిమా మీద ఒక మోస్తరు అంచనాలను అయితే తీసుకొని రాగలిగింది కానీ, ప్రభాస్ సినిమాకు జరిగేంత బజ్ ని మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. కారణం ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమాలు ఒకటి రెండు తప్ప, మిగిలినవన్నీ నిరాశపరిచినవే అవ్వడం. ఆ ప్రభావం ‘రాజా సాబ్’ మీద పడింది. అందుకే మేకర్స్ కోరినంత డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు బయ్యర్స్.
చాలా వరకు చర్చలు జరిపారు, నిర్మాత అనేక విషయాల్లో భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ బయ్యర్స్ తగ్గలేదు. దీంతో తక్కువ రేట్ కి ఈ సినిమాని ప్రతీ ప్రాంతంలో అమ్మాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అయితే అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఉదాహరణకు నైజాం ప్రాంతాన్ని తీసుకుందాం. ఇక్కడ ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి వచ్చే ప్రతీ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తూ వచ్చింది. ఒక్క ‘మిరాయ్’ చిత్రం తప్ప, మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకున్నాయి. వాటి నష్టాలను రాజా సాబ్ లెక్కల్లో కలిపి ఇస్తేనే తీసుకుంటామని చెప్పారట. అలా 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవాల్సిన సినిమా, కేవలం 40 కోట్ల రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది అట. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బిజినెస్ కేవలం 150 కోట్లకు జరిగింది.
ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి కానీ , డబ్బులు చేతికి వచ్చేది మాత్రం సినిమా విడుదల అయ్యాకే. ఈ చిత్రానికి నిర్మాత విశ్వ ప్రసాద్ పెట్టిన బడ్జెట్ 300 కోట్ల రూపాయిలు. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి, పెట్టిన ఆ బడ్జెట్ కి అసలు పొంతనే లేదు. ఆయన డబ్బులు పూర్తిగా రీకవరీ అవ్వాలంటే ఈ సినిమా కచ్చితంగా 300 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టాలి. ఇది చిన్న విషయం కాదు . సినిమాకు కచ్చితంగా అల్ట్రా పాజిటివ్ టాక్ రావాలి , అప్పుడే అంతటి సంక్రాంతి పోటీ ని తట్టుకొని ఈ సినిమా నిలబడుతుంది. స్వయంగా నిర్మాత విశ్వ ప్రసాద్ నే మొన్నటి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘మేము ఊహించినంత డబ్బులు ఇవ్వడానికి బయ్యర్స్ రెడీ గా లేరు. ఇక చేసేది ఏమి లేక తక్కువ రేట్ కి ఇచ్చేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు. చూడాలి మరి ఈ చిత్రం విడుదలయ్యాక లాభాలను రాబడుతుందా?, లేదా నష్టాలను చవిచూస్తుందా అనేది.