YouTuber Anvesh Arrest: యూట్యూబ్ లో లక్షల మందిని ప్రభావితం చేసే యూట్యూబర్స్ లిస్ట్ తీస్తే అందులో నా అన్వేషణ(Naa Anveshana) ఛానల్ అన్వేష్ మొదటి స్థానం లో ఉంటాడు. దాదాపుగా 120 దేశాల్లో పర్యటించి, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు మరియు జనాల నాగరికతని ప్రపంచానికి పరిచయం చేయడం తో ఇతన్ని కేవలం యూట్యూబ్ లోనే 40 లక్షల మంది అనుసరిస్తున్నారు. అయితే పెద్దలు చెప్పినట్టుగా, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని అందరూ అంటుంటారు. ఇతను మాట్లాడే బాషాని ని చూస్తే ఎవరికైనా రక్తం మరగక తప్పదు. అతని ఉద్దేశ్యాలు మంచివే అయ్యుండొచ్చు, కానీ మాట్లాడే బాషా అత్యంత హీనం. ముఖ్యంగా మన పురాణాల మీద ఇసుమంత కూడా గౌరవం లేకుండా, దేవుళ్ళ పై అతి నీచమైన కామెంట్స్ చేసిన ఇతను కనిపిస్తే జనాలు కొట్టి చంపేసెంత కోపం లో ఉన్నారు.
బెట్టింగ్ యాప్స్ మూత పడడంతో ప్రధాన భూమిక పోషించి ఎంతో మంచి పని చేసాడు అన్వేష్. కానీ ఆ సమయం లోనే ఇతను మాట్లాడే భాషపై కంప్లైంట్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్ గా శివాజీ హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై చేసిన వ్యాఖ్యలను ఇతను తప్పుబడుతూ తన అభిప్రాయం చెప్పడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ క్రమం లో ఆయన ఉపయోగించిన బాషా, శివాజీ ని తిట్టిన తీరు, చివరికి చాగంటి కోటేశ్వరరావు లాంటోళ్లను కూడా అత్యంత నీచమైన పదాజాలం తో ఇతను మాట్లాడిన పద్దతి, కోట్ల మంది కొలిచే హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఇతని నీచమైన బుద్ధిని చూసి, ఇతని యూట్యూబ్ ఛానల్ ని అనుసరించే లక్షలాది మంది అన్ ఫాలో అవుతున్నారు. కేవలం మూడు రోజుల్లోనే నాలుగు లక్షల మంది అన్న ఫాలో అయ్యారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఇతని పై నెగిటివిటీ ఏ స్థాయిలో ఉంది అనేది.
అతని వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దీంతో నేడు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఇతని పై కేసు నమోదు అయ్యింది. దానవాయిగూడెం కి చెందిన సత్యనారాయణరావు అనే వ్యక్తి సీతాదేవి, ద్రౌపది పై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేసాడని, ఇతను సమాజానికి చాలా ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితిలోనూ ఇతన్ని అదుపులోకి తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చాడు. అంతకుముందు వైజాగ్ లోనూ అన్వేష్ పై ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వివిధ ప్రాంతాల నుండి అన్వేష్ పై కేసులు ప్రతీ రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. కానీ అతను విదేశాల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రావడానికి ప్రభుత్వాలతో చర్చించి విదేశాలకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.