Naga Chaitanya: ఈ మధ్య కాలం లో సినీ హీరోలకు సినిమాల ద్వారా వస్తున్న ఆదాయం కంటే, వ్యాపారాల ద్వారా వస్తున్న ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. ఒక్క సినిమా చెయ్యడం కోసం ఏడాది సమయం తీసుకుంటున్న స్టార్ హీరోలు 40 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. పాన్ ఇండియన్ స్టార్ హీరోలు అయితే వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోలు మాత్రం 5 నుండి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నారు. అలాంటి హీరోలలో ఒకడు అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య సినిమా బడ్జెట్ ని బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
ఆయనకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని బట్టి సగటున ఒక్కో సినిమాకి 7 కోట్ల రూపాయిల అందుకుంటున్నాడు. కానీ వ్యాపారాల ద్వారా నాగ చైతన్య అంతకు మించి డబ్బులే సంపాదిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. నాగ చైతన్య కి హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, కావూరి హిల్స్ లో ‘షోయూ టేస్ట్ ఫుల్ ఏషియన్ డెలివెర్డ్’ అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ హైదరాబాద్ లోనే మోస్ట్ పాపులారిటీ సంపాదించిన టాప్ 10 రెస్టారెంట్స్ లో ఒకటిగా నిల్చింది. ఇక్కడ ఇప్పటి వరకు మనం ఎప్పుడూ రుచి చూడని వంటకాలు ఉంటాయి. నాగ చైతన్య ఎంతో ఆసక్తితో విదేశీ ఫుడ్ ని హైదరాబాద్ జనాలకు అందించాలనే తపనతో ఈ రెస్టారంట్ ని ప్రారంభించాడు. రోజుకి ఈ రెస్టారెంట్ నుండి 2 నుండి 3 లక్షల రూపాయిల ఆదాయం వస్తుందట. వీకెండ్స్ లో ఒక్కోసారి ఆదాయం డబుల్ కూడా అవుతూ ఉంటుందట. అలా ఆయనకి కేవలం ఈ ఒక్క రెస్టారెంట్ నుండి నెలకి 60 లక్షల రూపాయిల వస్తుందని తెలుస్తుంది. అంటే ఏడాదికి 8 నుండి 10 కోట్ల రూపాయల ఆదాయం నాగ చైతన్య కి అందుతుంది అన్నమాట. ఇది ఆయన సినిమా రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు.
ఇకపోతే నాగ చైతన్య కి ప్రస్తుతం ఇండస్ట్రీ లో తన మార్కెట్ ని కాపాడుకోవాలంటే భారీ హిట్ అత్యవసరంగా కావాలి. ఆయన హీరో గా నటించిన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ‘థాంక్యూ’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ‘కస్టడీ’ చిత్రం పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా నిరాశ పర్చింది. ఇప్పుడు ఆయన కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటి తో కలిసి ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్నాడు. సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో వేసిన ఒక భారీ సెట్ లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. అక్టోబర్ లో షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్.