https://oktelugu.com/

Committee Kurrollu Collections: నిర్మాతగా జాక్ పాట్ కొట్టేసిన నిహారిక..’కమిటీ కుర్రాళ్ళు’ 4 రోజుల్లో రాబట్టిన వసూళ్లు ఎంతంటే!

మెగా ఫ్యామిలీ లో దాదాపుగా అందరూ సక్సెస్లు చూసారు కానీ, పాపం నిహారిక కొణిదెల మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సక్సెస్ ని రుచి చూడలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన ఆమె, కనీసం నిర్మాతగా అయినా రాణించాలని అనుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 01:49 PM IST

    Committee Kurrollu Collections

    Follow us on

    Committee Kurrollu Collections: ఈ ఏడాది మెగా ఫ్యామిలీ కి అద్భుతంగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ తో పాటుగా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అలాగే మెగాస్టార్ చిరంజీవి కి కేంద్రం నుండి ‘పద్మవిభూషణ్’ పురస్కారం దక్కడం, వీటి అన్నిటికి మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ద్వారా ఈ ఎన్నికలలో నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్నీ ప్రాంతాల్లో తన పార్టీని గెలిపించుకొని అధికారంలోకి వచ్చి ఉపముఖ్యమంత్రి అవ్వడంతో పాటుగా నాలుగైదు ముఖ్యమైన శాఖలకు మంత్రి అవ్వడం వంటి అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కి మంచి రోజులు రామ్ చరణ్ కి క్లిన్ కారా పుట్టినప్పటి నుండి మొదలైంది.

    ఇది ఇలా ఉండగా మెగా ఫ్యామిలీ లో దాదాపుగా అందరూ సక్సెస్లు చూసారు కానీ, పాపం నిహారిక కొణిదెల మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సక్సెస్ ని రుచి చూడలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన ఆమె, కనీసం నిర్మాతగా అయినా రాణించాలని అనుకుంది. కానీ నిర్మాతగా ఆమె నిర్మించిన రెండు వెబ్ సిరీస్ లు కూడా నష్టాన్నే మిగిలించాయి. అయినప్పటికీ కూడా పట్టువదలకుండా ఆమె కొత్త కుర్రాళ్లతో రీసెంట్ గా ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని తెరకెక్కించి థియేటర్స్ లో విడుదల చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం నిర్మాణం కోసం నిహారిక కేవలం రెండు కోట్ల రూపాయిలను మాత్రమే ఖర్చు చేసింది. కానీ విడుదల తర్వాత నాలుగు రోజులకు గానూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 48 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే షేర్ లెక్కలోకి వేస్తే మూడు కోట్ల రూపాయలకు పైమాటే అన్నమాట. నిహారిక పెట్టిన రెండు కోట్ల రూపాయలకు, ఒక కోటి రూపాయిల లాభం వారం రోజుల లోపే వచ్చేసింది. ఇప్పుడిప్పుడే ఈ సినిమా గురించి సినీ సెలెబ్రిటీలు రివ్యూస్ ఇస్తున్నారు.

    నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా ట్వీట్స్ వేసి నిహారిక కి శుభాకాంక్షలు తెలియచేయగా, కాసేపటి క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా గురించి ట్వీట్ వేసాడు. ఇలా స్టార్ హీరోలందరూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడంతో ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. నిహారికకు నిర్మాతగా మరో రెండు కోట్ల రూపాయిల లాభం రావొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం సంస్థలు పోటీ పడుతున్నాయాట. నిహారికకు ఫ్యాన్సీ రేట్స్ ని ఆఫర్ చేస్తున్నాయట. అలా మొత్తం మీద అన్నీ రైట్స్ కలుపుకొని చూస్తే నిహారికకు ఈ చిత్రం ద్వారా 15 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయని అంచనా వేస్తున్నారు. అలా నిహారిక తొలి సక్సెస్ తోనే జాక్ పాట్ కొట్టేసింది.