https://oktelugu.com/

Johnny  Master : నేరాన్ని ఒప్పుకున్న జానీ మాస్టర్..రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలను బయటపెట్టిన పోలీసులు!

రిమాండ్ సెల్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని పోలీసులు విచారించగా, సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈమేరకు పోలీసులు విచారణలో వెలువడ్డ విషయాలను కాసేపటి క్రితమే మీడియా కి పంచుకున్నారు. జానీ మాస్టర్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 05:47 PM IST

    Johnny  Master

    Follow us on

    Johnny  Master :  ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని పోలీసులు నిన్న గోవా లో అరెస్ట్ చేసి, నేడు హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పర్చిన సంగతి తెలిసిందే. కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా, పోలీసులు ఆయన్ని చెంచల్ గూడా జైలుకు తరలించారు. రిమాండ్ సెల్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని పోలీసులు విచారించగా, సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈమేరకు పోలీసులు విచారణలో వెలువడ్డ విషయాలను కాసేపటి క్రితమే మీడియా కి పంచుకున్నారు. జానీ మాస్టర్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొనే జానీ మాస్టర్ శ్రేష్టి వర్మ ని తన టీంలోకి అసిస్టెంట్ గా తీసుకున్నాడని, 2019 సంవత్సరంలో వీళ్లిద్దరికీ తొలిసారి పరిచయమైందని పోలీసులు పేర్కొన్నారు.

    2020 వ సంవత్సరం లో జానీ మాస్టర్ ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులు మొదలు పెట్టాడని, ఆయన అలా ప్రవర్తించినప్పుడు, ఆ అమ్మాయి వయస్సు కేవలం 16 ఏళ్ళు మాత్రమే అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ నాలుగేళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ అనేక సార్లు లైంగిక దాడులు చేసినట్టుగా రిమాండ్ రిపోర్టు లో పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయట పెడితే, కెరీర్ లో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని పోలీసులు చెప్పుకొచ్చారు. నేరం ఒప్పుకున్నాడు కాబట్టి , పోలీసులకు పెద్ద శ్రమ దొరకలేదు. ‘పోస్కో’ చట్టం క్రింద జానీ మాస్టర్ కి పదేళ్లకు పైగా కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు ఈ కేసులో జానీ మాస్టర్ కి బెయిల్ కూడా దొరకదు. నేషనల్ అవార్డుని గెలుచుకొని, కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో, తన చేతులారా జానీ మాస్టర్ తన కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నాడు. భార్య ఉండగా ఒక మైనర్ బాలికపై జానీ మాస్టర్ ఇలాంటి లైంగిక దాడి చేయడం మానవీయ కోణం కాదని, అతనికి కఠినమైన శిక్ష పడాలసిందేనని, భవిష్యత్తులో ఇండస్ట్రీ లో ఉన్నటువంటి ఏ మగాడికైనా ఇలాంటి ఆలోచనలు రావాలంటేనే వణుకు పుట్టాలని, అలాంటి శిక్ష జానీ మాస్టర్ కి వేయాలంటూ బలమైన డిమాండ్ కొనసాగుతుంది.

    ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయమే జానీ మాస్టర్ తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనని ఎవరో కావాలని ఇరికిస్తున్నారని, న్యాయంగా పోరాడి బయటకి వస్తానని జానీ మాస్టర్ చెప్పినట్టు మీడియా లో వార్తలు వినిపించాయి. ఇంతలోపే ఆయన నేరం ఒప్పుకోవడం ఏమిటి..?, అది ఎలా సాధ్యం?, పోలీసుల దగ్గర జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్టుగా బలమైన ఆధారం ఏమైనా ఉందా?, అది చూపించడం వల్లే జానీ మాస్టర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. 14 రోజుల పాటు రిమాండ్ అని ప్రకటించిన కోర్టు, జానీ మాస్టర్ నేరాన్ని ఇంకా ముందే ఒప్పుకోవడంతో అతనికి తొందరగానే శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.