Star Hero: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కంప్లీట్ యాక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్… ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు ఎవరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆచితూచి మరి అడుగులు ముందుకు వేస్తున్నాడు. 66 సంవత్సరాల వయసులో ఉన్న మోహన్ లాల్ సినిమాలో యాక్టింగ్ చేయడమే కాకుండా లైవ్ లో డాన్స్ లు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
జర్మనీలో జరిగిన ఒక ఈవెంట్లో భాగంగా మోహన్ లాల్ తెలుగు సినిమాలోని ఒక పాట మీద డాన్స్ చేశాడు. ఇక దాంతోపాటుగా బాహుబలి సినిమాలోని మనోహరి సాంగ్ కు కూడా అతను ఆడి పాడటం విశేషం… ఇక ఇదంతా చూసిన అతని అభిమానులు ఆనందపడుతున్నారు.
నిజానికి మోహన్ లాల్ ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ మాత్రమే ఆయన ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉన్నాడు అంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా తెలియజేస్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మోహన్ లాల్ నుంచి ఇకమీదట చేయబోయే సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను షేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
ఇక మొత్తానికైతే మోహన్ లాల్ సీనియర్ హీరోలందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్టేజ్ మీద లైవ్ లో డ్యాన్స్ లు వేస్తూ తన అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా తను ఇప్పటికి చాలా యాక్టివ్ గా ఉన్నానని గొప్ప సబ్జెక్టులు తన దగ్గరికి తీసుకొస్తే చేయగలిగే కెపాసిటి తన దగ్గర ఉందని కూడా ఈ డ్యాన్స్ ద్వారా అందరికీ తెలిసేలా చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… మోహన్ లాల్ ఇంతకుముందు తెలుగులో మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు…
Swasika pic.twitter.com/BqIfABus2R
— BackUp Videos (@BackUpVidio) June 27, 2026
