https://oktelugu.com/

Chiranjeevi- Murali Mohan: చిరంజీవి పై విష ప్ర‌యోగం నిజమే.. ముర‌ళీమోహ‌న్ షాకింగ్ కామెంట్స్

Chiranjeevi- Murali Mohan: ఎంత గొప్ప విజయాల పంట కైనా.. మొదట ఒంటరి అడుగే పడుతుంది. ఆ అడుగు చప్పుడు కొందరికి నచ్చకపోవచ్చు. వారి రూపంలో ఎన్నో అవరోధాలు, మరెన్నో ఆపదలు ఎదురుకావొచ్చు. వాటినన్నిటిని దాటుకుని ముందుకు నడిచిన వాడే.. రహదారులను సృష్టించగలడు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి దారులెన్నిటిలోనే తన పాదాల ముద్రను మోపాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ, చిరు విజయం వడ్డించిన విస్తరికాదు. విజయానికి విలువ కట్టలేని కలల వెల చెల్లించాడు చిరు. విజేత అనేవాడు […]

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2022 / 10:29 AM IST
    Follow us on

    Chiranjeevi- Murali Mohan: ఎంత గొప్ప విజయాల పంట కైనా.. మొదట ఒంటరి అడుగే పడుతుంది. ఆ అడుగు చప్పుడు కొందరికి నచ్చకపోవచ్చు. వారి రూపంలో ఎన్నో అవరోధాలు, మరెన్నో ఆపదలు ఎదురుకావొచ్చు. వాటినన్నిటిని దాటుకుని ముందుకు నడిచిన వాడే.. రహదారులను సృష్టించగలడు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి దారులెన్నిటిలోనే తన పాదాల ముద్రను మోపాడు మెగాస్టార్ చిరంజీవి.

    Chiranjeevi

    కానీ, చిరు విజయం వడ్డించిన విస్తరికాదు. విజయానికి విలువ కట్టలేని కలల వెల చెల్లించాడు చిరు. విజేత అనేవాడు యాక్సిడెంటల్‌గా పుట్టడు. కానీ.. ఒక అనామకుడు విజేతగా నిలవడానికి ఎన్నో యాక్సిడెంటల్‌ లను తట్టుకుని, దాటుకుని రావాలి. చిరు కూడా తన సినీ కెరీర్ లో అలాంటివి ఎన్నో భరించి ముందుకు నడిచారు. ఓ సారి మెగాస్టార్ పై విష ప్రయోగం కూడా జరిగింది. చిరు భయపడలేదు. ఇంకా కష్టపడ్డాడు. జేబులో చేతులు పెట్టుకొని.. దర్జాగా నిచ్చెన ఎక్కలేం కదా అని ఆ కష్టాలతోనే ఎన్నో విజయాలు సాధించాడు.

    Chiranjeevi- Murali Mohan

    Also Read: Pawan Kalyan- Shobhan Babu: పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా?

    ఇంతకీ చిరంజీవి పై విష ప్రయోగం ఏమిటి ?, ముర‌ళీ మోహ‌న్ తాజాగా ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ అంశం పై ఏమి మాట్లాడారు. ఆయన మాటల్లోనే విందాం. ‘చిరంజీవిపై అప్ప‌ట్లో విష ప్ర‌యోగం జ‌రిగిందని పుకార్లు వచ్చాయి. అది పుకారు కాదు, నిజమే. ‘మ‌ర‌ణ‌మృదంగం అనే సినిమా షూటింగ్‌ కోసం చిరంజీవి చెన్నై వెళ్లారు. చెన్నైలో ఆ సినిమా షూటింగ్ చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవిని కలవడానికి సెట్స్ కి ఫ్యాన్స్ వచ్చేవారు.

    చిరంజీవిగారు కూడా రోజూ షూటింగ్‌లో య‌థావిధిగా ఒక‌సారి బ‌య‌ట‌కు వ‌చ్చి ఫ్యాన్స్‌ను క‌లిసేవారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా.. అందర్నీ ఆప్యాయంగా పలకరించి పంపేవారు. అలా ఒక రోజు ‘నేను మీకు పెద్ద అభిమానిని. ఈ రోజు నా పుట్టినరోజు’ అని చెప్పి చిరంజీవి గారి చేత కేక్ క‌ట్ చేసి తినిపించాడు ఓ అతను.

    Chiranjeevi

    నిజానికి చిరంజీవి ఇప్పుడు కేక్ ఏమి వ‌ద్దంటున్నా అతను బ‌ల‌వంతంగా తినిపించాడు. అభిమాని కోరిక కాదనలేక చిరంజీవి కూడా అయిష్టంగానే కేక్ తిన్నారు. తిరిగి వచ్చి షూట్ లో జాయిన్ అయ్యారు. కానీ, ఆయన పెద‌వులు మాత్రం నీలం రంగులోకి మారిపోయాయి. వెంట‌నే చిరంజీవి హుటాహుటిన హాస్పిట‌ల్‌ లో జాయిన్ అయ్యారు.

    విష ప్రయోగం జరిగిందని తేల్చిన వైద్యులు, ఆయనకు వెంటనే చికిత్స అందించారు. రెండు రోజుల పాటు చిరు హాస్పిటల్ లోనే ఉన్నారు ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. చిరంజీవి సక్సెస్‌ ఓర్వ‌లేకే ఎవ‌రో విష ప్ర‌యోగం చేశారని ముర‌ళీ మోహ‌న్ చెప్పుకొచ్చాడు. ముర‌ళీ మోహ‌న్ వ్యాఖ్య‌లు ప్రస్తుతం వైర‌ల్ గా మారాయి.

    Also Read: Amma Rajasekhar – Prabhas: అమ్మా రాజశేఖర్ – ప్రభాస్ కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా ?
    Recommended Videos


    Tags