The Paradise : మన స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్స్ ని అంత తేలికగా నమ్మరు. ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కి అనుభవం ఉండదు. అనవసరంగా మన స్టార్ స్టేటస్ ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టలేము అనే ధోరణితో ఉంటారు. పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న హీరోల తదుపరి సినిమాల లిస్ట్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. కానీ నాని(Natural star Nani), రవితేజ(Mass Maharaja Raviteja) వంటి వారు కొత్త డైరెక్టర్స్ ని బాగా ప్రోత్సహిస్తారు. రవితేజ కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం వల్లే నేడు హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, బాబీ, గోపీచంద్ మలినేని వంటి ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. కానీ ఈమధ్య కాలంలో రవితేజ కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇచ్చి బాగా నష్టపోయాడు. కానీ నాని మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు.
Also Read : నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ఆ హాలీవుడ్ చిత్రానికి రీమేకా? అడ్డంగా దొరికిపోయారుగా..స్టోరీ ఏమిటంటే!
‘జెర్సీ’ చిత్రంతో గౌతమ్ తిన్ననూరి, ‘దసరా’ తో శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela), ‘శ్యామ్ సింగ రాయ్’ తో రాహుల్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా వస్తుంది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒక సెన్సేషన్. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఎగబడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో మంచి సత్తా చాటే డైరెక్టర్స్ లో ఒకడిగా ఆయన నిల్చిపోతాడని అంటున్నారు. ‘దసరా’ తర్వాత ఆయన నాని తో కలిసి చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise). నిన్న ఈ సినిమా గ్లిమ్స్ విడుదలైంది. ఈ గ్లిమ్స్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయ్యింది. ఇదేమి కాన్సెప్ట్ రా బాబోయ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు. అయితే ఈ సినిమా ని శ్రీకాంత్ ఓదెల ఇప్పటికిప్పుడు రాసుకోలేదు. ‘దసరా’ సినిమా స్క్రిప్ట్ ని రాస్తున్న రోజుల్లోనే ఈ స్క్రిప్ట్ కూడా తయారు చేసాడు.
అయితే నాని కి దసరా సినిమా స్టోరీ ని వినిపించే ముందు, ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తమిళ హీరో సూర్య కి వినిపించాలని చాలా ప్రయత్నం చేసాడట డైరెక్ట్ శ్రీకాంత్ ఓదెల. కానీ సూర్య చుట్టూ ఉండే మనుషులు కనీసం శ్రీకాంత్ కి అపాయింట్మెంట్ ని కూడా ఇప్పించలేదట. దీంతో మానసికంగా శ్రీకాంత్ కృంగిపోయిన రోజులట అవి. ఇప్పుడు సూర్య(Suriya Sivakumar) ఈ మూవీ గ్లిమ్స్ వీడియో ని చూసుంటే, అబ్బా ఎలాంటి సినిమాని మిస్ అయ్యాను అని ఫీల్ అయ్యేవాడని అంటున్నారు విశ్లేషకులు.సూర్య కి చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. ఆ పనికిమాలిన ‘కంగువా’ మూవీ స్టోరీ చేయడం కంటే, ఈ సినిమాని చేసుంటే సూర్య కెరీర్ మళ్ళీ పూనుకునేది అంటూ ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుండా లేదా అనేది చూడాలి.
Also Read : ప్యారడైజ్ కథ తెలిసిపోయిందిగా…నాని పొడుగు జడల వెనక కారణం ఇదేనట… శ్రీకాంత్ మామూలుగా ప్లాన్ చేయలేదుగా…