https://oktelugu.com/

OTT Movie : సంక్రాంతి సినిమాల ఓటీటీ విడుదల తేదీలు ఖారారు..మూవీ లవర్స్ కి ఇది విజువల్ ఫీస్ట్!

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రం పూర్తిగా డిజాస్టర్ గా నిలిస్తే, బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రం యావరేజ్ గా ఆడింది. ఒక్క వెంకటేష్ సినిమా మాత్రమే కమర్షియల్ గా ఇప్పటికీ భారీ వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఊపు చూస్తుంటే మరి కొద్దిరోజుల్లో ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీలకు సంబంధించి ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తుంది.

Written By: , Updated On : January 29, 2025 / 09:20 PM IST
Sankranthi Movies in OTT

Sankranthi Movies in OTT

Follow us on

OTT Movie :  ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మినహా, మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం పూర్తిగా డిజాస్టర్ గా నిలిస్తే, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఒక్క వెంకటేష్ సినిమా మాత్రమే కమర్షియల్ గా ఇప్పటికీ భారీ వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఊపు చూస్తుంటే మరి కొద్దిరోజుల్లో ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీలకు సంబంధించి ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తుంది. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సంబంధించి HD ప్రింట్ ఇటీవలే సోషల్ మీడియాలో లీకై కలకలం సృష్టించింది.

ఈ సినిమాని మేకర్స్ ఫిబ్రవరి మొదటి వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని జీ5 సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ముందుగా ఈ చిత్రాన్ని కూడా ఫిబ్రవరి లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి వస్తున్నా వసూళ్ల సునామిని చూసి, ఫిబ్రవరి నెలాఖరుకు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇక నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. బాలయ్య రీసెంట్ సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో సుమారుగా 60 కోట్ల రూపాయలకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు. తెలుగు తో పాటుగా, అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఫిబ్రవరి 9వ తారీఖున ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది. థియేటర్స్ లో యావరేజ్ గా ఆడిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ ని కచ్చితంగా అలరిస్తుందని బలమైన నమ్మకంతో చెప్తున్నారు బాలయ్య అభిమానులు. థియేటర్స్ లో ఎందుకు ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిందంటే, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికే ఆడియన్స్ ఎక్కువ మొగ్గు చూపడం వల్ల అని అంటున్నారు. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ బాక్స్ ఆఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ని ముగించుకోవడం నేడు అర్థరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రానుంది. ఇలా రాబోయే రోజులు మొత్తం ఓటీటీ ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ చివరి సీజన్ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.